ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం రాష్ట్రపతి పాలన అస్త్రం!

సోనియాగాంధీకి ఆంధ్ర మీద ప్రేమ లేదు, తెలంగాణ మీద వాత్సల్యం లేదు. ఆమెకు, ఆమె చుట్టూ ఉన్న అనుచర గణానికి తెలుగు ఓటర్ల అభిమానం కావాలి. రాష్ట్రం రెండుగా విడిపోయినా రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్న నమ్మకం కలిగిన తర్వాతే మరో నిర్ణయం తీసుకునే అవకాశముంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే, టిఆర్ ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానన్న సంకేతాన్ని కెసిఆర్ కేంద్రానికి పంపించారు. అయినా దీని మీద తర్జన భర్జనలు ఇంకా జరుగుతున్నాయి.
ఇప్పుడు తెలంగాణ వాదుల చూపు కేంద్ర కేబినెట్ మంత్రి జైపాల్ రెడ్డి మీద ఉంది. కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణకు అనుకూలంగా 9న తొలి ప్రకటన చేసినప్పుడు జైపాల్ చాలా ఆనందం వ్యక్తం చేశారు. తన మనసులో ఉన్నా ఎప్పుడూ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడని జైపాల్ ఇలా బయటపడి ఇరుక్కున్నారు. ఇప్పుడు తెలంగాణ వాదులు జైపాల్ మీద విచిత్రమైన వత్తిడి తెస్తున్నారు. కేంద్ర కేబినెట్ లోనే ఉండి తెలంగాణ కోసం ఆయన సమరం చేయాలన్నది వారి ఉద్దేశం.
రాష్ట్రపతి పాలన విధిస్తే గవర్నర్ కు, ఆయన సలహాదారులకు, చీఫ్ సెక్రటరీకి పూర్తి అధికారాలు సంక్రమిస్తాయి. ఆరునెలల పాటు అసెంబ్లీని సస్పెండెడ్ యానిమేషన్ లో ఉంచవచ్చు. ఈలోపు పరిస్ధితులు శాంతిస్తే తెలంగాణకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశముంది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications