జగన్ పై రామోజీ ప్రతీకారం

Ramoji Rao
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ విషయంలో ఈనాడు దినపత్రిక అధిపతి రామోజీ రావు అదును చూసి వాత పెట్టే పద్ధతిని అనుసరిస్తున్నారా. పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తోంది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీపై రామోజీరావు వరుస కథనాలు ప్రచురిస్తూ వైయస్ జగన్ ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధిపతి, కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి, జగన్ కు మధ్య గల వ్యాపార లావాదేవీలను ఆయన వరుసగా తన దినపత్రిక ఈనాడు ద్వారా బయటపెడుతున్నారు. ఓబుళాపురం కంపెనీ అక్రమ తవ్వకాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపిస్తూ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో వార్తా కథనాలను ప్రారంభించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ద్వారా తన రాజకీయ వ్యూహాన్ని జగన్ అమలు చేసే అవకాశాలు ఉన్నాయని పసిగట్టిన రామోజీ రావు దానికి ఆటంకం కలిగించాలనే ఉద్దేశంతోనే వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో అచ్చయిన వార్తాకథనాలకు సమాధానం ఇవ్వడానికి గాలి జనార్దన్ రెడ్డి హైదరాబాద్ వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రామోజీరావుపై, ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణపై, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దానికి తోడు, జగన్ తో తనకు వ్యాపార సంబంధాలు లేవని కూడా చెప్పారు. దాన్ని ఆసరాగా తీసుకుని ఈనాడు దినపత్రిక సోమవారం ఈ సంబంధాలను బయటపెట్టే వార్తాకథనాన్ని పతాక శీర్షిక కింద అచ్చేశారు. ఓబుళాపురం మైనింగ్ లో 50 శాతం వాటా పొందుతున్న ఆర్ఆర్ గోల్డ్, రెడ్ గోల్డ్, జగన్ కు చెందిన జగతి పబ్లికేషన్ కార్యాలయాలు ఒకే ఆవరణలో ఉన్నాయని, జగన్ కు గాలి జనార్దన్ రెడ్డితో వ్యాపార లావాదేవీలున్నాయని చెప్పడానికి ఇదే నిదర్శనమని ఈ వార్తాకథనం సారాంశం.

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి నిరంతరం ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికల యాజమాన్యాలపై నిరంతరం విమర్సలు చేస్తూ వచ్చారు. దానికితోడు, రామోజీ ఆధిపత్యంలోని మార్గదర్శి పైనాన్స్ కంపెనీ అక్రమాలకు పాల్పడుతోందంటూ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడైన పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్ని రకాలుగా దాడి చేస్తూ వచ్చారు. దానికితోడు, ఈనాడుకు పోటీగా వైయస్సార్ తనయుడు వైయస్ జగన్ సాక్షి దినపత్రికను స్థాపించారు. ఈ స్థితిలో రామోజీరావు ఆత్మరక్షణ చేసుకోవడానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చిందని అంటున్నారు. వైయస్సార్ మృతి చెందడం, ఉండవల్లి మౌనం దాల్చడం, జగన్ కు కాంగ్రెసు అధిష్టానం పూర్తి మద్దతు ప్రకటించకపోవడం వంటి కారణాల వల్ల రామోజీరావు జగన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు. చంద్రబాబు సిపిఐ, సిపిఎం, లోకసత్తా నాయకులను కలుపుకుని ఉద్యమం చేపట్టడం ద్వారా జగన్ పై ముప్పేట దాడి సాగించాలనేది రామోజీ వ్యూహంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+