వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ పై సోనియా సీరియస్?

By Staff
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
న్యూఢిల్లీ: చంద్రబాబు నాయకత్వంలో మహాకూటమి నాయకులు ఢిల్లీలో ముఖ్యమంత్రి వైఎస్ పై తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ కుటుంబం వేలాది కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించుకున్నదన్నది వారి ప్రధాన ఆరోపణ. వైఎస్ అక్రమాలు అధిష్టాన వర్గానికి కలవరం కలిగిస్తున్నాయని తాజా సంకేతాలు అందుతున్నాయి. వైఎస్ కు అంతగా అనుకూలంగా ఉండని హనుమంతరావును, కేశవరావును ఎఐసిసిలో తీసుకోవడం ద్వారా అధిష్టానవర్గం తన సందేశాన్ని చెప్పకనే చెప్పింది.

రాష్ట్రంలో అనేక ప్రాజెక్టు ల్లో అవినీతి జరిగిందని, ఫెరా, ఫెమా నిబంధనలను అతిక్రమించి విదేశీ పెట్టుబడులను హవాలా ద్వారా సేకరించారని కాంగ్రెస్‌ అధిష్టానానికి అనేక మార్గాల్లో సమాచారం అందింది. రాష్ట్రంలో బోఫోర్స్ కుంభకోణాన్ని మించిన అవకతకలు చోటుచేసుకుంటున్నట్టు మహా కూటమి సాక్ష్యాధారాలతో సహా రాష్టప్రతిని కలిసి డాక్యుమెంట్లను సమర్పించబోతున్నది. రెండు రోజులుగా రాష్ట్ర వ్యవహారాలను జాతీయ స్ధాయికి తీసుకెళ్లడంలో మహా కూటమి విజయం సాధించినట్లేనని భావిస్తున్నారు.

మరెక్కడా లేని విధంగా పైసా పెట్టుబడులు లేకుండా కంపెనీల మీద కంపెనీలను సృష్టించడం, కుటుంబ ప్రయోజనాలకు పెద్ద పీట వేసి ప్రాజెక్టులకు అనుమతులివ్వడం తదితర చర్యలు పార్టీ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయని కాంగ్రెస్‌ పార్టీలోని సీనియర్‌ నేతలు అధిష్టానానికి తెలియజేశారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ దీన్ని చాలా తీవ్రంగా తీసుకున్నారు. మరో వంక రాహుల్‌ గాంధీతో సన్నిహిత సంబంధాలున్న యువ ఎంపీలు కొందరు ఇదే విషయంపై ఆయనతోనే నేరుగా చర్చించినట్లు తెలిసింది.

అధిష్టానంలోని కీలక నేతలు అహ్మద్‌ పటేల్‌, ప్రణబ్‌ ముఖర్జీ ఇదే విషయంపై సోనియా గాంధీకి సవివరమైన నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. దానిపై ఆమె రాహుల్‌తో చర్చించారు. మొన్నమొన్నటి దాకా రిలయెన్‌‌స ఇన్‌ఫ్రా విషయంలో కేంద్రం మౌన ముద్ర దాల్చిన నేపధ్యంలో ఆంధ్ర ప్రదేశ్‌ వ్యవహారాలను కూడా కేంద్రం చూసీ చూడనట్లు వదిలేస్తుందని కొందరు భావించారు. అయితే రిలయెన్‌‌స కధ తాజాగా అడ్డం తిరిగింది. రిలయెన్‌‌స ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ లిమిటెడ్‌ కంపెనీ విషయంలో అనిల్‌ అంబానీ విదేశీ మారక ద్రవ్య నిబంధనలను ఉల్లంఘించారు. విదేశాల్లో సమీకరించిన నిధులను దేశీయ క్యాపిటల్‌ మార్కెట్లకు బదలాయించారు.తద్వారా విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టాన్ని అతిక్రమించినట్లు కేంద్ర ఆర్దిక శాఖ ధృవీకరించింది. పాలక పక్షంలోని ఒక వర్గం అంబానీకి దన్నుగా నిలిచి దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా కొద్ది రోజులు ఆపగలిగింది. అయితే అది ఎంతో సేపు నిలవలేదు. రాహుల్‌ గాంధీ చొరవతో దాని మీద చర్యకు ఉపక్రమించారు.

అందులో భాగంగానే మంగళ వారం నాడు పార్లమెంటులో కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ రిలయెన్‌‌స చేసిన తప్పులను సభకు వివరించారు. ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలను ఉపేక్షించి వదిలేస్తే జాతీయ ఆర్ధిక వ్యవస్ధ అతలాకుత లమై పోతుందని ఇది మరో ఆర్ధిక మాంద్యానికి దారి తీయొచ్చని ప్రణబ్‌ అటు రాహుల్‌కి, ఇటు సోనియాకు నచ్చచెప్పగలి గారు. ఇదే సమయంలో ఇలాంటి అవక తవకలకు పాల్పడుతున్న వాళ్లు...ఎంతటి వాళ్లయినా సరే...వాళ్లపై చర్య తీసుకోక పోతే ఎన్నికల సమయంలో విశ్వసనీయత కోల్పోతామని రాహుల్‌ గట్టి పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే మేటాస్‌ కంపెనీని కేంద్రం స్వాధీనం చేసుకున్న విషయాన్ని కేంద్ర వర్గాలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాయి. అంతే కాదు. మేటాస్‌లో అంతటి భారీ కుంభకోణం జరగడానికి కారకులెవరన్నది తెలుసుకు నేందుకు రాహుల్‌ ప్రత్యేక శ్రద్ధ కనబరిచినట్లు సమాచారం. దీని మీదనే ఆయన అహ్మద్‌ పటేల్‌, ప్రణబ్‌ ముఖర్జీలతో గత రెండు రోజుల్లోనే మూడు విడతలుగా చర్చలు జరిపినట్లు తెలిసింది.

సత్యం కంప్యూటర్‌‌స ఉన్న ఫళంగా నట్టేట మునగడం, మేటాస్‌పై అమిత ప్రేమతో అధిక ప్రాజెక్టులు కట్టబెట్టడం చూసి సోనియా గాంధీ సైతం ముక్కున వేలేసుకున్నారని కాంగ్రెస్‌ అధిష్టానానికి సన్నిహితంగా ఉండే ఒకరిద్దరు నేతలు చెబుతున్నారు. ప్రతిపక్షాలన్నీ ఒక్కటై దాడిని ముమ్మరం చేయడం..మరో వంక ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్‌కు ఇది అగ్ని పరీక్షలా తయారైంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధిష్టానం ఆంధ్ర ప్రదేశ్‌పైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. తీరా రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితి విషమంగా మారడాన్ని సోనియా గాంధీ నిశితంగా గమనిస్తున్నారు. ఇంతటి హఠాత్పరిణామాలకు కారణాలేమిటో, వాటికి కారకులెవరో ధృవీకరించుకున్నారని భోగట్టా. ఏది ఏమైనా ఎన్నికల సమయంలో ప్రజలకు విశ్వాసం కలిగించే దిశగా కొన్ని నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని సోనియా, రాహుల్‌ ఒక నిర్ణయానికొచ్చారని, రెండు మూడు రోజుల్లో అవి అమల్లోకి వస్తాయని కాంగ్రెస్‌ వర్గాలు చెప్పాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X