Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ శక్తియుక్తులు

YS Jaganmohan Reddy
వైయస్ జగన్ శక్తియుక్తులన్నీ కాంగ్రెసు పార్టీ అధిష్ఠాన వర్గానికి వివరించానని, జగన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేస్తారని ఆశిస్తున్నానని దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మీయ మిత్రుడు కెవిపి రామచందర్ రావు అన్నారు. అసలు జగన్ శక్తియుక్తులేమిటి. జగన్ సమర్థత గురించి తనకు తెలుసునని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ అన్నారు. జగన్ ను వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడిగా మాత్రమే చూడకూడదని, జగన్ సాధించిన విజయాలున్నాయని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ అన్నారు. జగన్ సామర్థ్యాన్ని కెవిపితో పాటు పార్టీ కీలక నేతలు కూడా గుర్తిస్తున్నారు. నిజానికి, జగన్ సామర్థ్యమంతా వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే బయట పడుతూ వచ్చింది. ప్రతిపక్షాల విమర్శలకు కూడా జగన్ ప్రధాన కేంద్ర బిందువుగా మారారు. కుమారుడిని అదుపు చేయలేకపోతున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైయస్ రాజశేఖర రెడ్డిని మందలించారు కూడా. అయితే, అన్ని వ్యవహారాల్లో జగన్ చేయి పెడుతూ వచ్చారనే విషయాన్ని అందరూ అంగీకరిస్తున్నారు.

జగన్ భారీ యెత్తున సాక్షి దినపత్రికను, టీవీ చానెల్ ను ప్రారంభించి నడిపిస్తున్నారు. వేలాది రూపాయల జీతాలతో ఉద్యోగులను నియమించుకున్నారు. వీటితో పాటు పలు ప్రాజెక్టులు ఆయన చేపట్టారు. పలు ప్రాజెక్టుల్లో ఆయన భాగస్వామిగా ఉన్నట్లు ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ప్రస్తుత కాంగ్రెసు పార్లమెంటు సభ్యుల పెట్టుబడులు జగన్ సంస్థల్లో ఉన్నట్లు కూడా చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తానొక్కడే కాకుండా వైయస్ లాభసాటిగా చేసినట్లు ప్రచారం ఉంది. పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వంటి వారితో జగన్ వ్యాపార భాగస్వామి అంటారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్ ల) పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం రాష్ట్రంలో పెద్ద యెత్తున సాగింది. గత ఐదేళ్లలో దానికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. దీంట్లో ఎక్కువగా లాభపడింది వైయస్ లాబీలోని జగన్ వర్గీయులేననే విమర్సలు కూడా ఉన్నాయి. ఈ లాబీ అంతా ఇప్పుడు ఒక్కటై జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనే పట్టుదలతో ఉంది.

జగన్ కు సంబంధించి మరో అంశం కూడా కలిసి వస్తోంది. రాష్ట్రంలోని రెడ్లంతా కలిసికట్టుగా జగన్ నాయకత్వం కావాలంటున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా పని చేసిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి, జెసి దివాకర్ రెడ్డి వంటి వారు కూడా జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని అంటున్నారు. తెలుగుదేశంలోని మైసురా రెడ్డి వంటివారు కూడా జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్నట్లు చెప్పవచ్చు. దీనికి రాజకీయ కారణం ఉంది. జగన్ ను ముఖ్యమంత్రిని చేసి తమ ప్రాబల్యం తగ్గకుండా, తమ లావాదేవీల్లో తేడా రాకుండా చూసుకోవాలని వైయస్ వర్గీయులు భావిస్తుండగా ఈ లాబీ మాత్రం తెలంగాణ బిసిలకు ముఖ్యమంత్రి పదవి పోతుందేమోననే భయంతో ఉంది. నిశితంగా గమనిస్తే, తెలంగాణకు చెందిన వి హనుమంతరావు, డి. శ్రీనివాస్ వంటి సీనియర్ బిసి నేతలు జగన్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తుంది. జగన్ ఉప ముఖ్యమంత్రి పదవికి అంగీకరిస్తే పెద్ద మనుషుల ఒప్పందం మేరకు తెలంగాణ నాయకుడిని ముఖ్యమంత్రిని చేయాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా రెడ్లే ఉండడం సాధ్యం కాదు కాబట్టి ముఖ్యమంత్రి పదవి తెలంగాణ బిసి నాయుకుడికి ఇవ్వాల్సి వస్తుంది. ఈ ఆశతోనే భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య జగన్ కు దూరంగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతోంది. అందుకే శాసనసభ్యురాలు కొండా సురేఖ జగన్ లాబీకి దూరం జరిగినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో తెలంగాణ రెడ్లు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటుండగా, తెలంగాణ నేతను ముఖ్యమంత్రిగా అంగీకరించడం ఇష్టం లేక తెలంగాణేతర నాయకులు జగన్ ముఖ్యమంత్రి కావాలని అంటున్నారు.

జగన్ శక్తియుక్తులన్నీ ఇవే. అయితే, కాంగ్రెసు పార్టీ అధిష్ఠాన వర్గం ఆలోచన మాత్రం జగన్ పట్ల వ్యతిరేకత చూపడానికి ఇతర కారణాలున్నాయి. జగన్ ఒత్తిడికి లొంగకూడదనేదే ఆ వ్యతిరేకతకు కారణం. ఈ స్థితిలో జగన్ ను ముఖ్యమంత్రిని చేసే విషయంలో కెవిపి రామచంద్ర రావు చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+