హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయశాంతి నిర్ణయం వెనుక?

By Staff
|
Google Oneindia TeluguNews

Vijayasanthi
హైదరాబాద్: నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీని, తెలంగాణ రాష్ట్ర సమితిని తిట్టి పోసిన తల్లి తెలంగాణ పార్టీ అధినాయకురాలు విజయశాంతికి ఇప్పుడు వారిద్దరే ముఖ్యమైనట్టు కనిపిస్తోంది. నేడు టీఅర్ ఎస్ నేత చంద్రశేఖరరావుతో గంటసేపు సమావేశమైన విజయశాంతి తన పార్టీని టీఅర్ ఎస్ లో విలీనం చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. రేపు రాత్రి విందుకు కె సీఅర్ ను ఆమె ఆహ్వానించారు. ఎల్లుండి ఆమె తన పార్టీ విలీనం గురించి ప్రకటించే అవకాశముంది. ఈనెల 21 న తెలుగుదేశం నాయకత్వంలో టీఅర్ ఎస్, లెఫ్ట్ ల మహాకూటమి ప్రకటన అధికారికంగా వెలువడనుంది.

తెలంగాణ రాష్ట్రానికీ మద్దతు ఇచ్చే పార్టీలతో కలిసి పనిచేస్తానని విజయశాంతి చెబుతూ వచ్చారు. అందుకు అనుగుణంగానే ఆమె టీఅర్ ఎస్ లో విలీనమై, మహా కూటమిలో సభ్యురాలు కానున్నారు. విజయశాంతి టీఅర్ ఎస్ తరఫున ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమెను మహా కూటమి వైపునకు ఒడుకుగా నడిపించుకువచ్చినది బాలకృష్ణేనని తెలుస్తోంది. బాలకృష్ణ-విజయశాంతి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ లు వచ్చాయి. అహంభావం ప్రదర్శించని వ్యక్తి బాలకృష్ణ అని అనేక సందర్భాల్లో విజయశాంతి ఆయన మీద ప్రశంసల జల్లులు కురిపించింది. దీనికితోడు విజయశాంతి భర్త అయిన ప్రసాద్ చంద్రబాబు నాయుడికి సన్నిహితుడని చెబుతున్నారు.

ఒక దశలో తెలుగుదేశం పార్టీలో చేరడమే ఉత్తమమని భావించిన విజయశాంతి ఆ తర్వాత విరమించుకున్నారు. నాలుగేళ్ళ పాటు తెలంగాణ జెండా పట్టుకుని తిరిగి సడన్ తెలుగుదేశం పార్టీలో చేరితే ఆక్షేపణలు వస్తాయని ఆమె భయపడ్డారు. టీఅర్ ఎస్ లో కలిసినా ఎటూ తెలుగుదేశం మహా కూటమిలోనే ఉంటాం కదా అన్న ఉద్దేశంతో ఆమె టిఆర్ ఎస్ లో విలీనం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

గతంలో బిజెపి జాతీయ మహిళా మోర్చాలో పని చేసిన విజయశాంతికి ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక ఫేవర్లు లభించినట్టు ఆరోపణలు ఉన్నాయి. బిజెపి కేంద్రంలో అధికారంలో ఉన్నడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండే వారు. రాష్ట్రంలో కూడా అమెకు అనేక వరాలు లభించినట్టు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X