హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరు మద్దతు కాంగ్రెస్ కేనా?

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ కు 120, తెలుగుదేశం నాయకత్వంలోని మహాకూటమికి 125, చిరంజీవి ప్రజారాజ్యానికి 50, ఇండిపెండెంట్లకు 4 స్ధానాలు వస్తే ఏమవుతుంది? ఇది ఊహా జనితమైన ప్రశ్నే అయినా ఆలోచించగదినది. హంగ్ అసెంబ్లీ ఏర్పడే పక్షంలో చిరంజీవి ఎవరికి మద్దతు ఇస్తారన్నది కీలకాంశం కాబోతోంది.

చిరంజీవి పార్టీ పెడుతున్నట్టు ప్రకటన చేసినప్పుడు దాని వల్ల నష్టం కాంగ్రెస్ కేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. కాపు, తెలగ, బలిజలు ఎన్నో దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా ఉండడమే దానికి కారణం. కాపులు ప్రజారాజ్యానికి ఓటేసినా చివరికి చిరంజీవి కాంగ్రెస్ కే మద్దతు ఇస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన సీట్లు చిరంజీవికి ఈ ఎన్నికల్లో రావన్నది స్పష్టం. ఫలితాలు వచ్చాక చిరంజీవి అటు కాంగ్రెస్ కో ఇటు మహాకూటమికో మద్దతు ఇచ్చుకోవలసి ఉంటుంది.

కమ్మ-కాపుల మధ్య చారిత్రక శత్రుత్వం ఉన్నందువల్ల చిరంజీవికి సహజ ఎంపిక కాంగ్రెసే అవుతుంది. అందువల్లనే చిరంజీవి ఈమధ్య్ కాంగ్రెస్ మీద విమర్శలు తగ్గించి తెలుగుదేశం, వామపక్షాలపై సెటైర్లు వేస్తున్నారు. చిరంజీవి రాజమండ్రి బహిరంగ సభ హిట్ కావడానికి కాంగ్రెస్ నాయకులు పరోక్ష సహకారం అందించినట్టు సమాచారం.

చిరంజీవి- వైఎస్ ల మధ్య రహస్య అవగాహన కుదరడానికి మరో కారణం జూనియర్ ఎన్టీఆర్. ఉత్తరాంధ్రలో గత మూడు రోజులుగా ఎన్టీఆర్ నిర్వహిస్తున్న రోడ్ షోలు సూపర్ హిట్ కావడంతో కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీలు కంగారు పడుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఈ విధంగా కాంగ్రెస్, ప్రజారాజ్యం మధ్య రహస్య అవగాహనను మరింత పటిష్టం చేశారని అనుకోవాలి. ఈ ఆర్టికల్ ను మీ మిత్రులకు పంపుకోవడం చాలా సులభం.

ఈ ఆర్టికల్ ను మీ మిత్రులకు పంపుకోవడం చాలా సులభం. కింద ఉన్న ఇ-మెయిల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X