వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ పై అస్మదీయుల వత్తిడి!

By Santaram
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్ జగన్ కాంగ్రెస్ అధిష్టానవర్గంపై తిరుగుబాటుకు సిద్ధమైనట్టే. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న జగన్ ఎంతవరకైనా తెగించడానికి సిద్ధమవుతున్నారన్నది ఎప్పటికీ ఎన్నటికీ తాజా సమాచారం. కాంగ్రెస్ లో చీలిక తేవడానికి ప్రయత్నించడం మొదటి వ్యూహం. అది విఫలమైతే మరో రకంగా అధిష్టానవర్గం పై ఒత్తిడి తేవడం తదుపరి వ్యూహం. అయితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనే వ్యూహాన్ని అమలు చేయాలా ఆ తర్వాతా అని ఆలోచిస్తున్నట్టు సమాచారం.

రేపు వీరప్ప మొయిలీ గ్రేటర్ ఎన్నికల వ్యూహం ఖరారు చేయడానికి హైదరాబాద్ వస్తున్నారు. జగన్ మాత్రం తండ్రి పోయిన విషాదంలో అలా మిగిలిపోయి ఉన్నారు. ఇంకా ఆయన మెత్తగానే ఉన్నారు. ఆయనను కదిలించి, నగారా మోగించాలని వైయస్ వర్గానికి చెందిన హార్డ్ కోర్ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. జగన్ ను ఎమోషనల్ అరెచ్చగొడుతున్నారు.

వీరప్ప మొయిలీ ఇటు ఉన్నారా? అటు ఉన్నారా? ఎటూ లేరా అన్నది తేలడానికి చాలా సమయం పట్టవచ్చు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జులుగా జగన్నాధ్ పహాడియా నుంచి వీరప్ప మొయిలీ వరకు కనీసం పది మంది వ్యవహరించారు. వీరిలో చాలా మంది ఈ రాష్ట్రం నుంచి, ఈ పదవి నుంచి ఏమి వస్తుందని ఆశించిన వారే.

జగన్ వర్గంలో మాత్రం ఓవరాక్షన్ కు ఏమాత్రం తక్కువ లేదు. ఎమ్మెల్యేలే కాకుండా సాక్షాత్తు సాక్షి కూడా జగన్ కోసం వీరంగం వేస్తోంది. ఎమ్మెల్యేల వెర్షన్ చూడండి: ఆదినారాయణరెడ్డి, తదితర ఎమ్మెల్యే లు ఈ సందర్భంగా ఆవేశంగా మాట్లాడినట్లు సమా చారం. '2004లో మీ నాయన ఎంతో కష్టపడి, ప్రాణాలను పణంగా పెట్టి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. అప్పుడు ఆయనకు తగినంత మంది మద్దతు లేకున్నా ఎంతో రిస్కు తీసుకు న్నారు. ఇప్పుడు నీకు ఎమ్మెల్యేలు, ఎంపీలంతా మద్దతిస్తు న్నారు. అయినా ఎందుకు వెనుకంజ వేస్తున్నామో అర్ధం కావడంలేదు. ఇలాగే ఉంటే మనల్ని పూర్తిగా అణచివేస్తున్నారు. ఇప్పుడు పీఆర్పీని చూపెట్టి భయపెడుతున్నారు. రేపు ఇంకోటి చూపెట్టి భయపెడతారు. హైకమాండ్‌ ఆలోచన స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోకుండా ఎంతకాలం సహిస్తాం" అని ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. ఆయనతో అక్కడున్న వారంతా ఏకీభవించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X