నిత్యానంద భక్తుల రక్షణలో రంజిత?

Ranjitha
హైదరాబాద్: నిత్యానంద స్వామి ఎక్కడున్నాడు? రంజిత కూడా ఆయన పక్కనే ఉందా? ఇద్దరూ విదేశాలకు ఉడాయించారా? ఆధ్యాత్మిక గురువు నిత్యానందతో రాసలీలలు సాగిస్తున్న దృశ్యాలు ఓ తమిళ న్యూస్‌ చానల్‌లో ప్రసారమైన నాటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన నటి రంజిత ఆయన శిష్యుల సంరక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. నిత్యానంద మాత్రం తాను వారణాసిలో జరుగుతున్న కుంభమేళాలో ఉన్నట్లు తన లాయర్‌ ద్వారా ప్రకటనలు చేయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రంజిత ఎక్కడ ఉన్నారోనన్న ఉత్కంఠ నెలకొంది. వారం రోజుల క్రితం కేరళలో ఉన్న రంజిత అమెరికాకు చెక్కేసినట్టు వార్తలొచ్చాయి. నిత్యానంద భారతదేశంలోనే ఉన్నట్టు భావిస్తున్నారు.

రంజిత మాత్రం అమెరికా నుంచి సింగపూర్‌కు, అక్కడి నుంచి మలేషియాకు మకాం మార్చినట్టు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా నిత్యానందకు శిష్యులు ఉండడంతో వారి సంరక్షణలోనే ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక్కడ రంజితకు హత్య బెది రింపులు రావడం, నిత్యానందంకు వ్యతిరేకంగా ఆమె చేత సాక్ష్యం చెప్పించేందుకు కొన్ని అదృశ్య శక్తులు ప్రయత్నిస్తుండడంతో విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. మలేషియాలో నిత్యానందం శిష్యుల రక్షణలో ఉన్న ఆమె మరో వారం రోజుల్లో చెన్నైకు వచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.

ఇక్కడకు వచ్చిన తర్వాత తన పూర్తి సమయాన్ని ఆధ్యాత్మిక సేవలకు కేటాయించాలని రంజిత నిర్ణయించినట్టు సమాచారం. ఇదిలావుండగా రాష్ట్రంలోని నిత్యానందం శిష్యులను అరెస్ట్‌ చేసి, విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ నామక్కల్‌ జిల్లా నల్లిపాళెంకు చెందిన నిత్యశరవణనందా దాఖలు చేసిన పిటిషన్ ‌పై బుధవారం మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి నాగముత్తు నేతృత్వంలోని బెంచ్‌ విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది మునియప్ప రాజ్‌ తన వాదన విన్పించారు. నిత్యానందం శిష్యులపై ఎలాంటి ఫిర్యాదులూ రాలేదని స్పష్టం చేశారు. దీంతో ఈ పిటిషన్‌ విచారణయోగ్యం కాదని న్యాయమూర్తి తిరస్కరించారు.

ఇదిలా ఉండగా నిత్యానందంతో నటి కెఆర్‌ విజయ సోదరి కుమార్తె రాగ సుధా, మరో నటి రోహిణికి సంబంధముందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ వార్తలను రోహిణి ఖండించారు. తాను ప్రస్తుతం పెన్‌ సింగం చిత్రంలో నటిస్తున్నానని, నందలాల విడుదలకు సిద్ధమవుతోందని అన్నారు. తనకు ఆధ్యాత్మిక ప్రవచనలపై నమ్మకం లేదని స్పష్టం చేశారు. నిత్యానందంను తాను ఇంత వరకు చూడలేదని, ఆయన కార్యక్రమాలకు వెళ్లిన దాఖలు లేవని అన్నారు. తనపై తప్పుడు కథనాలు రాయడం బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+