కెసిఆర్ పత్రిక ఆంధ్రావాళ్లకేనా?

నమస్తే తెలంగాణ పత్రిక తెలంగాణ ప్రజల మైండ్ సెట్ ను మాత్రమే కాకుండా ఆంధ్ర ప్రజల మైండ్ సెట్ ను కూడా మారుస్తుందని కెసిఆర్ అంటున్నారు. తమ పత్రికకు తెలంగాణ ప్రజలు సేల్స్ ప్రమోటర్స్ గా వ్యవహరించాలని కూడా ఆయన కోరుతున్నారు. ఈ పత్రిక చదవాలని తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలను, ముఖ్యంగా హైదరాబాదులోని సీమాంధ్ర ప్రజలను కోరాలని ఆయన సూచించారు. నమస్తే తెలంగాణ పత్రిక డిసెంబర్ లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. కరీంనగర్ జిల్లాలో నమస్తే తెంలగాణ పత్రిక కార్యాలయం నిర్మాణానికి కెసిఆర్ దసరా రోజు భూమి పూజ చేశారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పత్రిక కోసం భూమి పూజలు జరిగాయి.
నమస్తే తెలంగాణ పత్రికకు ఇప్పటికే చంద్రశేఖర రావు సిబ్బందిని కూడా సమకూర్చుకున్నారు. వారు రంగంలోకి దిగారు. నవంబర్ నుంచి పత్రిక పనిచేయడం ప్రారంభిస్తుంది. ప్రస్తుతం పత్రిక కోసం తీసుకున్న పైస్థాయి సిబ్బంది తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు.












Click it and Unblock the Notifications