వాడుకున్నాడు, జయప్రద నోట బూతు మాట!

కానీ జయప్రద మాటలకు మరో అర్ధం కూడా ఉండవచ్చు. దానిని పాజిటివ్ గా తీసుకుంటే 1994 లో జయప్రద తెలుగుదేశం పార్టీలో చేరి కొత్తలో ఎన్నికల ప్రచారసభల్లో ఆమె చేసిన ప్రసంగాలు సూపర్ హిట్ అయ్యాయి. అవి పార్టీ విజయంలో కొంత పాత్ర వహించాయి. ఆ విషయాన్ని అప్పటి ఎన్టీఆర్ గ్రహించి ఆమెకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆ తర్వాత ఆమె తెలుగుదేశం తరఫున రాజ్యసభ సభ్యురాలయ్యారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత జయప్రద అమర్ సింగ్ తో సాన్నిహిత్యం పెంచుకోవడం చంద్రబాబుకు నచ్చలేదు. అప్పటికే దారుణమైన అప్పుల్లో, ఆనేక ఆర్ధిక కేసుల్లో ఉన్న జయప్రదకు అమర్ సింగ్ ఆపద్బాంధవుడిలా కన్పించారు. ఎప్పుడైతే చంద్రబాబు ఆమెను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించారో అప్పుడామెను అమర్ సింగ్ ములాయం వద్దకు తీసుకెళ్ళి ఉత్తరప్రదేశ్ లో నైనా ఆమె గెలవగలదని, సమాజ్ వాది టికెట్ ఇవ్వమని కోరారు. ములాయం ఆమెకు రాంపూర్ ఎంపీ టికెట్ ఇచ్చారు. రాష్ట్రం గాని రాష్ట్రంలో కూడా ఆమె అంత పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉన్న రాంపూర్ లో గెలుపొందారు. ఒక మహిళ కాబట్టి ఆమె ప్రతిభా సామర్ధ్యాలను ఈ పురుషాధిక్య సమాజం పూర్తిగా అంచనా వేయలేకపోతోంది. రాజమండ్రి మెరక వీధి నుంచి ఆమె ఉత్తరప్రదేశ్ రాంపూర్ వరకు, ప్రత్యక్ష ఎన్నికల్లో లోక్ సభలో సగర్వంగా కూర్చోగలుగుతున్నదంటే ఆమెలో ఎన్నో మెరిట్స్ ఉన్నాయని ఒప్పుకోవాలి.
నాణేనికి మరో వైపు ఏమిటంటే ఆమె మీద రాజకీయ నాయకుల గుసగుసలు. "మోస్ట్ బ్యూటిఫుల్ ఉమన్ ఆన్ ఇండియన్ స్క్రీన్" అని జయప్రదను ప్రశంచించాడు మహా దర్శకుడు సత్యజిత్ రే. ఆమె అందాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం, మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ ను దించినప్పుడు రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి కోసం చంద్రబాబు నాయుడు ఉపయోగించారని అప్పట్లో ఎల్లో పత్రికల్లో కథనాలు వచ్చాయి. వాటి విశ్వసనీత ఎలా ఉన్నా జనం నోళ్ళ వరకు ఆ ఇష్యూ వెళ్ళిపోయింది.
ఎన్టీఆర్ సరసన ఆ రోజుల్లో హీరోయిన్ గా అందాలు ఆరబోసిన నటి జయప్రద. వేటూరి పాటలు అప్పట్లో ట్రెండ్ సెట్టర్లు. డబుల్ మీనింగ్ లు అప్పట్లోనే వచ్చాయి. ఇప్పుడు జయప్రద "నన్ను చంద్రబాబు వాడుకుని వదిలేశాడు" అనడాన్ని డబుల్ మీనింగ్ గా తీసుకోవడం సహజమే. సినిమాల్లో, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.