పవన్ కళ్యాణ్ పై సాక్షి విసుర్లు

పవన్ కళ్యాణ్ స్థానంలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఎవరు వస్తారని కూడా ప్రశ్నించింది. పార్టీకి అవసరమైనప్పుడు పవన్ కళ్యాణ్ వస్తారని, పార్టీకి పవన్ కళ్యాణ్ దూరం కాలేదని చెప్పిన ప్రజారాజ్యం అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మాటలను కూడా ప్రసారం చేసింది. పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి కొన్ని దృశ్యాలను మధ్యమధ్యలో ప్రసారం చేసింది. సాక్షి ఆ కథనాన్ని ప్రసారం చేయడం టిఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికా, చిరంజీవిపై వ్యతిరేకతతోనా అనే ప్రశ్న వేస్తున్నారు. అయితే, చిరంజీవిపై వ్యతిరేకతతోనే ఆ వార్తాకథనాన్ని ప్రసారం చేయడానికి అవకాశం ఉందనే మాట బలంగా వినిపిస్తోంది.
ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కాంగ్రెసు పార్టీకి దగ్గరైనప్పటి నుంచి వైయస్ జగన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తనకు పోటీగానే చిరంజీవిని కాంగ్రెసు అధిష్టానం చిరంజీవిని చేరదీసినట్లు ఆయన భావిస్తున్నట్లు ప్రచారం కూడా జరిగింది. అప్పటి నుంచి సాక్షి టీవీ చానెల్లోనూ, దినపత్రికలోనూ చిరంజీవికి వ్యతిరేకంగా వార్తాకథనాలు వస్తున్నాయని చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఏ మాత్రం సందర్భం లేకుండా పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా వార్తాకథనాన్ని ప్రసారం చేసినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications