జగన్ ముందస్తు జాగ్రత్త

YS Jagan
కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ముందస్తుగా చెల్లించిన పన్ను రాజకీయ వర్గాలను దిమ్మ తిరిగేలా చేసింది. తొలి ఆరు సంవత్సరానికి గాను ఆయన 84 కోట్ల రూపాయల పన్నును ముందస్తుగా చెల్లించారు. ఈ వార్త వెలువడిన మరుక్షణం రాజకీయ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఆయన చెల్లించిన పన్నును బట్టి ఆయన ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరంలో 520 కోట్ల రూపాయల దాకా ఉంటుందని అంచనా వేశారు. ఆయనకు ఉన్న కంపెనీల సంఖ్య కూడా దండిగానే ఉంది. అయితే, ముందు జాగ్రత్త చర్యగానే వైయస్ జగన్ పన్ను చెల్లించినట్లు భావిస్తున్నారు. రాజకీయంగా ఇబ్బందులు ఏర్పడవచ్చుననే ఉద్దేశంతో ఆయన అందుకు పూనుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైయస్ జగన్ ఆస్తులను జప్తు చేసి, సిబిఐ విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో యనమల ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఒక్క ఏడాదిలోనే వందల కోట్ల రూపాయల ఆదాయం పెరగడం వెనక మతలబు ఉందనేది ఆయన ఆరోపణ.

కాగా, వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో వైయస్ జగన్ ఆస్తులు పెద్ద యెత్తున పెరిగాయనేది లోకానికి తెలుసు. కోట్లాది రూపాయలకు జగన్ పడగలెత్తాడు. మీడియాను, మీడియా ద్వారా రాజకీయ, పారిశ్రామిక రంగాలను శాసించడానికి కూడా ఆయన సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే జగతి పబ్లికేషన్ సంస్థ ద్వారా సాక్షి దినపత్రికను వెలువరిస్తున్నారు. టీవీ చానెల్ వస్తోంది. తనపై వచ్చే, వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడానికే ఈ రెండు సంస్థలను జగన్ వాడుకుంటున్నారు. అయితే, ఇంతకు ముందు జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థలకు ఆదాయం పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఆ సంస్థలపై ఓ కన్నేసి ఉంచింది. పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి వైయస్ జగన్ ఓదార్పు యాత్ర చేపట్టిన నేపథ్యంలో ఆ చర్యలు ప్రారంభమయ్యాయి.

అధిష్టానంతో పోరాటం చేయడానికే సిద్ధపడిన జగన్ ఆదాయానికి సంబంధించిన ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికే ఆదాయం పన్నును అంత పెద్ద మొత్తంలో చెల్లించారనే మాట వినిపిస్తోంది. చేతికి మట్టి అంటకుండా జగన్ తన సంస్థల్లోకి వైయస్సార్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెట్టుబడులను రాబట్టుకున్నారని అంటారు. అంతేకాకుండా, భారతి సిమెంట్స్ నుంచి ఎమ్మార్ ప్రాపర్టీస్ దాకా పలు రూపాల్లో వైయస్సార్ వర్గానికి చిక్కిన కోట్లాది రూపాయల ఆస్తుల్లో వైయస్ జగన్ కు దక్కింది చాలా ఉందనే ఆరోపణలున్నాయి. అయితే, ఆయన న్యాయబద్దంగా ఉండేలా లొసుగులను సవరించి క్లీన్ గా ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నట్లు వినికిడి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+