మారిన జగన్ తెలంగాణ వైఖరి?

తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి అనుసరించిన వ్యూహమే సరైందని అనుకుంటున్నారు. ఆచరణలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ మాటల్లో మాత్రం అనుకూలంగా మాట్లాడాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది తాను కాదని అంటూ తన చేతుల్లో ఏమీ లేదని జగన్ తెలంగాణ ప్రజలకు చెప్పాలని చూస్తున్నారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కూడా ఆయన చెప్పనున్నారు. అయితే తెలంగాణ ప్రాంత నాయకులను దగ్గర చేసుకోవడానికి ఆయన ఇది వరకే ఆ వ్యూహాన్ని అమలు చేసినట్లు చెబుతున్నారు. తెలంగాణలోని కాంగ్రెసు నాయకులకు అవే మాటలను వినిపించినట్లు వినికిడి.
అదే సమయంలో, తెలంగాణలో ఓదార్పు యాత్రను ప్రారంభించడానికి వ్యూహాత్మక ప్రాంతాన్ని ఎన్నుకోవాలని కూడా ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి తెలంగాణలో ఓదార్పు యాత్రను ప్రారంభించాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలో రాయలసీమ ప్రభావం ఉండడం, రాయలసీమతో మహబూబ్ నగర్ వారికి బంధుత్వాలు ఉండడం వంటివాటిని ఆయన తనకు అనుకూలంగా మలుచుకోవాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఒకరిద్దరు నాయకులు, ఓ శాసనసభ్యుడు జగన్ ను ఓదార్పు యాత్రకు ఆహ్వానించినట్లు కూడా తెలుస్తోంది. అయితే, ఇది ఎంత వరకు ఫలితం ఇస్తుందో చెప్పలేం.












Click it and Unblock the Notifications