జగన్ ఎమ్మెల్యేలకు బొత్స గాలం?

Botsa Satyanarayana
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాల జోరుకు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష తీరుకు కాంగ్రెసు పార్టీ నూతన సారథి బొత్స సత్యనారాయణ చెక్ పెట్టగలరని పలువురు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయాలపై ఎమ్మెల్యేలు, మంత్రులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే వాదనలు వినిపించాయి. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలలో మంత్రులను, ఎమ్మెల్యేలను సంప్రతించకుండానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని విఫలమవుతున్నారనే వాదనలు బలంగా వినిపించాయి, వినిపిస్తున్నాయి. దీంతో పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇక జగన్ కూడా కాంగ్రెసు పార్టీని బలహీన పర్చేందుకు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు తెలంగాణ అంశం మండుతూనే ఉంది. ఇలాంటి సున్నితమైన, ప్రధానమైన సమస్యల నేపథ్యంలో బొత్స సత్యనారాయణే సరైన అభ్యర్థిగా భావించి కేంద్రం ఆయనకు పిసిసి బాధ్యతలు అప్పగించింది. సత్తిబాబు నియామకాన్ని తెలంగాణతో పాటు అన్ని ప్రాంతాల వారు ఆమోదించారు కూడా.

బొత్స నియామకం సిఎంకి ఇష్టం లేనప్పటికీ అధిష్టానం ఆయనవైపే మొగ్గు చూపింది. ముఖ్యమంత్రి అన్నింటిలో విఫలం అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో బొత్స సత్యనారాయణ కేంద్ర బిందువు కానున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా కాంగ్రెసు ప్రతిపక్షంలో ఉన్నప్పడు పిసిసి అధ్యక్షుడికి ప్రాధాన్యత ఉంటుంది. కానీ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కాకుండా బొత్స ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉందని ఉందని పార్టీలో వాదనలు వినిపిస్తున్నాయి. సిఎం కంటే బొత్సకు ప్రాధాన్యత పెరుగుతుందనే వార్తల నేపథ్యంలో భవిష్యత్తులో జరిగే పరిణామాల దృష్ట్యా పలువురు బొత్స బాధ్యతలు చేపట్టక ముందే ఆయనను కలిసి అభినందనలు తెలుపుతున్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా చిత్తూరులో ఆయనకు బద్ద వ్యతిరేకి అయిన మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొత్సను కలిశారు. అంతేకాదు వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులుగా భావిస్తున్న రేగా కాంతారావు, జోగి రమేష్ కూడా బొత్సను కలిశారు. ఇన్నాళ్లూ ముఖ్యమంత్రి వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్న వారు, బొత్స నియామకం వల్ల పార్టీ గాడిన పడుతుందని భావిస్తున్న జగన్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా బొత్సకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+