వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాపూజీకి బాబు ప్రమోషన్, కెసిఆర్‌కు జోష్

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu-K Chandrasekhar Rao
అదృష్టమో, ప్రత్యర్థుల లోపమో తెలియదు గానీ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు ప్రతి విషయమూ కలిసి వస్తోంది. కెసిఆర్‌ను మూలకు నెట్టాలని ప్రత్యర్థులు ప్రయత్నించడం విఫలం కావడం గత దశాబ్ద కాల తెలంగాణ ఉద్యమంలో జరుగుతూ వస్తోంది. అప్పటికప్పుడు కెసిఆర్ ఆత్మరక్షణలో పడినట్లే కనిపిస్తారు, మరు క్షణంలో పైకి లేస్తారు. తాజాగా, అటువంటి సంఘటనే చోటు చేసుకుంది. స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ నేతృత్వంలో ఏర్పాటైన రాష్ట్ర సాధన తెలంగాణ సాధన సమితి కెసిఆర్‌కు ఎసరు పెడుతుందని అందరూ భావించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వ్యక్తిత్వం పట్ల ప్రజలకు ఉన్న నమ్మకం అలా అనిపించింది. కానీ, తాజా ప్రచారం అందుకు భిన్నమైన ఫలితాలు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

కెసిఆర్‌కు, తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్‌కు ప్రత్యామ్నాయంగా మరో జెఎసిని ఏర్పాటు చేయడానికి తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులు తీవ్ర ప్రయత్నాలే చేశారు. వారి ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించి ఓ రూపం తీసుకున్నట్లు అనిపించడమే తరువాయి ఎదురు దెబ్బ తగిలే పరిస్థితి వచ్చింది. కొండా లక్ష్మణ్ బాపూజీ నేతృత్వంలో మరో జెఎసిని ఏర్పాటు చేయడంలో తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు విజయం సాధించారు. అయితే, కొండా లక్ష్మణ్ బాపూజీ వెనక చంద్రబాబు ప్రోద్బలం ఉందనే వార్తలు గుప్పుమన్నాయి. చంద్రబాబు ప్రోద్బలం, ప్రోత్సహం ఉందనే మాట బయటకు రావడంతో కెసిఆర్‌కు జోష్ వచ్చిందనే చెప్పాలి. చంద్రబాబు నేతృత్వంలో పనిచేసే జెఎసిని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు.

రాష్ట్ర సాధన తెలంగాణ సమన్వయ కమిటీ ఏర్పాటు తర్వాత దానికి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కొండా లక్ష్మణ్ బాపూజీ టీవీ చానెళ్లలో చర్చా గోష్టుల్లో పాల్గొనే ఏర్పాట్లు కూడా చంద్రబాబు నాయుడే చేశాడని ప్రచారంలోకి వచ్చింది. బాపూజీ వివిధ టీవీ చానెళ్లలో పాల్గొని తెలంగాణ సాధనపై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును విమర్శించారు. కోదండరామ్‌ను తప్పు పట్టారు. దీంతో తెలంగాణ ప్రజలు కొండా లక్ష్మణ్ బాపూజీ వెనక చంద్రబాబు ఉన్నారని, అందుకే బాపూజీ అలా మాట్లాడుతున్నాని అనుకుంటున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఏమైనా, ఇది కెసిఆర్‌కు కలిసి వచ్చిందనే చెప్పాలి.

English summary
As there is rumour that TDP president N Chandrababu Naidu is promoting Konda Laxman Bapuji, TRS president K Chandrasekhar Rao got relief.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X