సోనియాపై బాబు టిట్ ఫర్ ట్యాట్?

జాతీయ స్థాయిలో బలహీనపడుతున్న కాంగ్రెసు పార్టీ ప్రాంతీయ పార్టీలను వివిధ రూపాల్లో దెబ్బ తీయాలని భావిస్తోందని, అందుకు సిబిఐని వాడుకుంటోందని చంద్రబాబు జాతీయ నేతలకు వివరించారని అంటున్నారు. దానికి బ్రేకులు వేయకపోతే ప్రాంతీయ పార్టీల ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందని ఆయన అంటున్నారని తెలుస్తోంది. కోర్టు ప్రస్తుతం అందరి పిటిషన్లను స్వీకరిస్తున్నందున తాము సోనియాపై వేసే పిటిషన్‌ను కూడా స్వీకరిస్తుందని తెలుగుదేశం నాయకులు గట్టిగా నమ్ముతున్నారని అంటున్నారు.
తెలుగుదేశం పార్టీ ప్రధానంగా సోనియా అల్లుడు రాబర్ట్ వద్రాను లక్ష్యం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయన ఆస్తులు, ఆయన సంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు, కాంట్రాక్టుల వివరాలపై తెలుగుదేశం పార్టీ నియమించిన న్యాయవాదుల బృందం అధ్యయనం చేస్తోందని అంటున్నారు. సోనియా కుటుంబ సభ్యులకు సంబంధించిన వివిధ ప్రభుత్వేతర సంస్థలను కూడా ఇందులోకి లాగాలని చూస్తున్నట్లు సమాచారం. పిటిషన్ ఎవరు వేయాలనే చర్చ కూడా సాగుతోంది. పార్టీపరంగా వేయాలా, వ్యక్తుల పరంగా వేయాలనే ఆలోచన సాగుతున్నట్లు చెబుతున్నారు. వ్యక్తులపరంగా వేయాల్సి వస్తే పార్టీ నాయకులు ఎర్రంనాయుడు లేదా యనమల రామకృష్ణుడు వేయవచ్చునని అంటున్నారు. ఏమైనా, ఇది ఏ మేరకు రూపు దాలుస్తుందో వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications