చిరు నినాదం అందుకున్న బాబు?

అయితే అనూహ్యంగా చిరంజీవి రాజకీయాల్లోకి రావడంతో కాపులంతా ఆయన వెంట నడిచారు. అయితే మూడు సంవత్సరాలు కూడా నడపకుండానే తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెసులో విలీనం చేయడంతో చంద్రబాబు గతంలో తెదేపాతో ఉండి చిరు పార్టీ స్థాపించాక ఆయనతో వెళ్లిన వారిని తిరిగి పార్టీ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. వంగా గీత, బండారు సత్యానందరావు తదితర ప్రధాన నేతలు తెదేపా నుండి చిరు పంచన చేరిన వారే. కృష్ణా జిల్లాలో వంగవీటి రాధాకృష్ణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడంతో అక్కడి విభేదాలు తనకు అనుకూలంగా మల్చుకునే వ్యూహంలో బాబు ఉన్నారని సమాచారం.
ఇక రాయలసీమ ప్రాంతంలోనూ బలంగా ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ధీటుగా ఎదుర్కొనేందుకు అక్కడి బలిజ సామాజిక వర్గాన్ని పార్టీ వైపు తిప్పుకునేందుకు బాబు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారట.












Click it and Unblock the Notifications