ఎన్టీఆర్‌పై బాలయ్య ఆయుధం

Jr NTR
తన కుమారుడు నారా లోకేష్ రాజకీయ ప్రవేశాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్‌పైకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన బావమరిది బాలకృష్ణను ప్రయోగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. తన తండ్రి నందమూరి హరికృష్ణ ప్రోత్సాహంతో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరుకు తెర తీసిన విషయం తెలిసిందే. చంద్రబాబును హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీని కార్పొరేట్ కార్యాలయంగా మార్చడాన్ని హరికృష్ణ తప్పు పడుతున్నారు. ఈ స్థితిలో నందమూరి కుటుంబ సభ్యుల్లో చంద్రబాబు చీలిక తెచ్చినట్లు భావిస్తున్నారు.

హరహర మహదేవ సినిమా షూటింగు సందర్భంగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను బట్టి చంద్రబాబు వ్యూహమేమిటో అర్థమైందని అంటున్నారు. బాలకృష్ణ వ్యాఖ్యల వెనక చంద్రబాబు హస్తం ఉందని అంటున్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని, తెలుగుదేశం పార్టీలో అందరూ సమానమేనని బాలకృష్ణ అన్నారు. తన ప్రసంగం చివరలో జై తెలుగుదేశం నినాదాలు కూడా ఇచ్చారు. దీన్నిబట్టి జూనియర్ ఎన్టీఆర్‌ను, హరికృస్ణను ఎదుర్కోవడానికి బాలకృష్ణ సిద్ధపడ్డారని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కు, బాలకృష్ణకు మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది.

బాబాయ్ అంటూ వెంట తిరిగిన జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ జన్మదిన వేడుకలకు రాలేదు. హరికృష్ణ కూడా కనిపించలేదు. నందమూరి హీరోలు కళ్యాణ్ రామ్, తారకరత్న మాత్రం బాలయ్యకు ఇరు వైపులా ఉన్నారు. దీన్నిబట్టి బాలకృష్ణకు, జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య చిచ్చు రగులుతున్నట్లే భావించాల్సి ఉంటుంది. చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు బాలకృష్ణ తన కూతురు బ్రాహ్మణిని ఇచ్చి వివాహం చేశారు. బాలకృష్ణ తన చేయి దాటిపోకుండా ఉండేందుకే చంద్రబాబు ఈ పెళ్లి చేశారని అంటున్నారు. ఆయన వ్యూహం ప్రకారమే బాలకృష్ణ తన అల్లుడు నారా లోకేష్‌కు మద్దతుగా నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. చంద్రబాబుకు కూడా ఆయన అండదంటలుంటాయి.

బాలకృష్ణ తన తండ్రి మాదిరిగా రాజకీయాల్లోకి వచ్చి, ముఖ్యమంత్రి పీఠం అధిష్టించడం అసాధ్యమే కావచ్చు. పార్టీ నారా లోకేష్ చేతుల్లోకి వెళ్లిపోయిన తర్వాత ఆయనకు ఆ అవకాశం రాదని అంటున్నారు. బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+