చిరంజీవి ఏడాది ఆగాల్సిందేనా?

Chiranjeevi
తనకు ఇష్టమైన కేంద్ర మంత్రి పదవిని చేపట్టడానికి ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఏడాది పాటు ఆగాల్సిందేననే ప్రచారం జరుగుతోంది. ఈలోగా ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించే ఆలోచనలో కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, చిరంజీవి పార్టీ పదవులు తీసుకోవడానికి సుముఖంగా లేరు. ఆయన కేంద్ర మంత్రి పదవినే కోరుకుంటున్నారు. అయితే, చిరంజీవికి మంత్రి పదవి ఇవ్వాలంటే ఒపిక పట్టాల్సి ఉంటుందని అంటున్నారు. రాజ్యసభకు ఎన్నిక చేసి, చిరంజీవికి మంత్రి పదవి ఇవ్వాలనేది కాంగ్రెసు అధిష్టానం ఆలోచన. అయితే, ఇందుకు రాజ్యసభ సీటు ఖాళీ కావాల్సి ఉంటుంది.

రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నాయకుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి చేత రాజీనామా చేయించాలని, అందుకు ప్రతిగా జనార్దన్ రెడ్డిని ఏదైనా రాష్ట్రానికి గవర్నరుగా పంపించాలని, అలా ఖాళీ అయిన రాజ్యసభ సీటుకు చిరంజీవిని ఎంపిక చేసి మంత్రి పదవి ఇవ్వాలని అనుకుంటున్నారు. కానీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అందుకు అంగీకరించకపోతే, చిరంజీవి కోరిక నెరవేరడానికి సమయం పట్టే అవకాశం ఉంది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అంగీకరించకపోతే చిరంజీవిని కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి)లోకి తీసుకోవాలని, రాష్ట్ర స్థాయిలో ఏర్పడే సమన్వయ కమిటీలో స్థానం కల్పించాలని కాంగ్రెసు అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇందుకు చిరంజీవి సుముఖంగా లేరని చెబుతున్నారు.

ఇదంతా రెండు మూడు వారాల తర్వాత కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీ విలీనం అధికారికంగా పూర్తయిన తర్వాతనే చర్చకు వస్తుందని అంటున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో ప్రజారాజ్యం పార్టీకి చెందిన ముగ్గురు శానససభ్యులకు మంత్రి పదవులు ఇవ్వాలని చిరంజీవి కోరుతున్నారు. అధిష్టానం ఇద్దరిని మంత్రివర్గంలోకి తీసుకోవడానికి మాత్రమే ఇష్టపడుతోంది. ఏమైనా, ఈ విషయాలపై స్పష్టత రావడానికి మూడు వారాలైనా పట్టవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+