వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరుకు ఖరారు, రాజ్యసభ సీట్లకు పోటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన చిరంజీవికి రాజ్యసభ సీటు ఖరారైనట్లు సమాచారం. మరో మూడు సీట్ల కోసం కాంగ్రెసు నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రం నుంచి ఏప్రిల్‌లో ఖాళీ అయ్యే ఆరు రాజ్యసభ సీట్లలో అధికార కాంగ్రెసు పార్టీకి నాలుగు సీట్లు దక్కే అవకాశాలున్నాయి. కాంగ్రెసుకు చెందిన దాసరి నారాయణ రావు, రషీద్ అల్వీ, కె. కేశవరావు, జి. సంజీవరెడ్డి, తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంవి మైసురా రెడ్డి, సిపిఐకి చెందిన అజీజ్ పాషాల రాజ్యసభ కాలపరిమితి వచ్చే ఏడాది ఏప్రిల్ 2వ తేదీన ముగుస్తోంది. గత రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెసు సిపిఐకి ఓ సీటు ఇచ్చింది. రెండు పార్టీల మధ్య సఖ్యత చెడిపోవడంతో ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయిది.

చిరును రాజ్యసభకు పంపడం దాదాపుగా ఖరారు కావడంతో కాంగ్రెసులో మరో నాలుగు సీట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెసు అధిష్టానం మూడోసారి రషీద్ అల్వీకి రాజ్యసభ టికెట్ ఇవ్వవచ్చునని భావిస్తున్నారు. మిగతా వారిని తిరిగి నామినేటయ్యే అవకాశాలు లేవని అంటున్నారు. ఈ మూడు సీట్ల కోసం మాజీ పార్లమెంటు సభ్యుడు మల్లు రవి, ఎఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి, శాసనసభ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. పిసిసి మాజీ అధ్యక్షుడు పి. నరసారెడ్డి కూడా రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

చిరంజీవిని జనవరిలో లేదా ఫిబ్రవరిలో కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుని, ఏప్రిల్‌లో రాజ్యసభకు ఎంపిక చేసే అవకాశం ఉంది. రేణుకా చౌదరి ఢిల్లీలో పావులు కదుపుతున్నారు. మల్లు రవి ఇటీవల ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. సురేష్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. మొత్తం మీద పోటీ తీవ్రంగానే ఉండే అవకాశం ఉంది. మరో రెండు సీట్లను తెలుగుదేశం పార్టీ దక్కించుకునే అవకాశం ఉంది.

English summary
With the Congress sources claiming that Chiranjeevi has been virtually assured of a Rajya Sabha nomination, aspirants for a place in the upper house have began lobbying for the remaining three seats that the ruling party can expect to bag in the elections slated to take place in April next year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X