సిబిఐ దర్యాఫ్తు: బాబు, జగన్ తీరులో వైరుధ్యం!

Chandrababu Naidu and YS Jaganmohan Reddy
సిబిఐ దర్యాఫ్తు విషయంలో తెలుగుదేశం పార్టీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల వ్యాఖ్యలలో పూర్తి వైరుధ్యం కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ ఆస్తులపై హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించినప్పుడు ఆయన వర్గం నేతలు కాంగ్రెసుపై విరుచుకు పడ్డారు. ప్రాథమిక విచారణపై పలు సందర్భాలలో మాట్లాడారు. కానీ జగన్ అక్రమాలకు పాల్పడలేదని నేతలు గట్టిగా మాట్లాడిన సందర్భాలు దాదాపు లేవని పలువురు అభిప్రాయపడుతున్నారు. దివంగత వైయస్ అక్రమాలకు పాల్పడినట్లు భావిస్తే మంత్రివర్గం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందనే వాదాన్ని తెరపైకి తీసుకు వచ్చారే కానీ తమ నేత అక్రమాలకు పాల్పడలేదని అంతే గట్టిగా చెప్పిన సందర్భాలు చాలా తక్కువ అంటున్నారు. అంతేకాకుండా జగన్ పార్టీ నుండి బయటకు వెళ్లడంతో ఆయనను ఎదుర్కొలేక టిడిపి, కాంగ్రెసులు కుమ్మక్కై కుట్రతో జగన్‌పై కేసులు పెడుతున్నారని విమర్శించారని కానీ వచ్చిన ఆరోపణలపై మాత్రం స్పష్టత ఇవ్వలేక పోయారనే వారూ ఉన్నారు.

అదే సమయంలో టిడిపి మాత్రం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ వేసిన పిటిషన్ పైన తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగుతున్నారు. తెలుగుదేశం విజయమ్మ పిటిషన్‌పై కోర్టుల చుట్టూ తిరుగుతూనే మరోవైపు ఆమె పిటిషన్‌లో తాము అవాస్తవాలు అని భావించిన వాటిని ప్రజల ఎదుట ఎత్తి చూపిస్తున్నారు. తమ నేత అధికారంలో ఉండగా ఎప్పుడూ తప్పు చేయలేదని చెప్పుకొస్తున్నారు. మొన్న రేవంత్ రెడ్డి నుండి నేడు దూళిపాళ్ల నరేంద్ర వరకు విజయమ్మ పిల్‌లోని పలు అంశాలను తప్పు పడుతూ అవి బాబు హయాంలో జరగలేదని కాంగ్రెసు, వైయస్ హయాంలోనే జరిగాయని ఎదురు దాడికి దిగుతున్నారు. విజయమ్మ పిల్ పైన టిడిపి ఎదురుదాడి చేయడానికి ఎక్కడా ఆత్మస్థైర్యం కోల్పోయినట్లుగా కనిపించడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అయితే తమ తమ అధినేతల ఆస్తుల కేసుపై ఇరు పార్టీల నేతలు పరస్పర విరుద్ధంగా స్పందిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నప్పటికీ ఒక్క విషయంలో మాత్రం వారి వాదనలు ఒకేరకంగా ఉన్నాయి. జగన్ ఆస్తులపై కేసు పెట్టినప్పుడు వైయస్సార్ కాంగ్రెసు నేతలు టిడిపి, కాంగ్రెసు కుమ్మక్కైందని, సిబిఐ కాంగ్రెసు తొత్తు అని విమర్శించాయి. ఇప్పుడు బాబు ఆస్తులపై కేసు పెట్టాక టిడిపి నేతలు జగన్, కాంగ్రెసు కుమ్మక్కై తమ అధినేతపై కేసు పెట్టారని, సిబిఐ అంటే కాంగ్రెసు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+