వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూ.ఎన్టీఆర్, నారా లోకేష్ ఫైట్ ఖతమ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Nara lokesh-Jr Ntr
తెలుగుదేశం పార్టీలో వారసత్వం కోసం జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేష్ మధ్య ప్రారంభమైన పోరుకు తాత్కాలికంగా తెర పడినట్లు భావిస్తున్నారు. నారా లోకేష్‌కు పార్టీ పగ్గాలు అప్పగించడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారనే వార్తల నేపథ్యంలో నందమూరి, నారా కుటుంబాల మధ్య చిచ్చు చెలరేగింది. నందమూరి హరికృష్ణ బావ చంద్రబాబుపై అలిగిన విషయం బాహాటంగా బయటపడింది. పార్టీ మహానాడులో ఆయన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు.

నారా లోకేష్ చేత రాజకీయ రంగ ప్రవేశం చేయించాలనే ప్రయత్నాలను చంద్రబాబు విరమించుకోవడంతో ఆ పోరాటం ముగిసినట్లు భావిస్తున్నారు. చాలా ఎడమొహం పెడమొహంగా ఉంటూ వస్తున్న చంద్రబాబు, హరికృష్ణ ఇటీవల ఢిల్లీలో చేతులు కలిపినట్లు సమాచారం. అంతర్గత పోరు వల్ల లాభం కన్నా నష్టం జరుగుతుందని భావించి చంద్రబాబు వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. ఇప్పటికే, జగన్ వల్ల సీమాంధ్రలో, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వల్ల తెలంగాణలో పార్టీ పరిస్థితి ఏ మాత్రం బాగా లేదు. దీంతో పార్టీని కాపాడుకోవాలంటే అంతర్గత పోరుకు స్వస్తి చెప్పాలని ఆయన అనుకున్నట్లు చెబుతున్నారు.

పార్టీని బలోపేతం చేసి 2014 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని, ఆ తర్వాతనే లోకేష్‌కు పగ్గాలు అప్పగించే విషయంపై ఆలోచించాలని చంద్రబాబు అనుకున్నట్లు తెలుస్తోంది. దీంతో నారా లోకేష్ వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా కొంత కాలం ఆగడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ తర్వాతనే తేల్చుకుందామనే ఉద్దేశంతో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు.

English summary
It is said that the fight in Telugudesam was ended between Jr Ntr and Nara Lokesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X