వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీజ లవ్‌స్టోరీ ఎందుకు విఫలమైంది?

By Pratap
|
Google Oneindia TeluguNews

Srija
పాఠశాలలో చదువుతున్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ హైదహరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియంలో బాడ్మింటన్ ప్రాక్టీస్ చేసేవారు. చిరంజీవి తరుచుగా శ్రీజను స్టేడియం వద్ద తన వాహనంలో దించి, ఆటలో ఆమె నైపుణ్యాన్ని పరిశీలిస్తూ ఉండేవారు. చిరంజీవి తన కూతురు పట్ల చూపే శ్రద్ధకు శ్రీజ మిత్రులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉండేవారు. ఆమె చక్కగా ప్రాక్టీస్ చేసి ఉంటే సైనా నెహ్వాల్‌లా అంతర్జాతీయ క్రీడాకారిణి అయి ఉండేవారు కావచ్చు. బహుశా, చిరంజీవి కూడా అదే ఆశించి ఉంటారు.

తన కూతురు కూడా ఇతరుల కూతుళ్లు గురయ్యే భావనకే గురి కావాలని చిరంజీవి ఆమెకు సమయం ఇస్తూ వచ్చేవారు. తానో సెలిబ్రిటీ అని గానీ తనకు సమయం ఉండదని గానీ అనిపించుకునేందుకు ఇష్టపడేవారు కారు. అందుకే, ఆమె పట్ల శ్రద్ధ చూపుతుండేవారు. శ్రీజ మంచి బాడ్మింటన్ క్రీడాకారిణి కావాలనే చిరంజీవి స్వప్నం సాకారం కాలేదు. 2007 అక్టోబర్ 17వ తేదీన శిరీష్ భరద్వాజ్‌ను ఆమె ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు తీవ్ర నిరుత్సాహానికి, అసంతృప్తికి చిరంజీవి గురై ఉంటారని చెప్పవచ్చు. అప్పుడు మీడియాలో తీవ్ర దుమారం చెలరేగింది. మళ్లీ తన భర్త శిరీష్ భరద్వాజ్‌పై శ్రీజ వరకట్నం వేధింపుల కేసు పెట్టినప్పుడు కూడా అంతే దుమారం చెలరేగుతోంది.

శ్రీజ భర్తను వదిలేసి ఇంటికి రావడం పట్ల చిరంజీవి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయం అలా ఉంచితే, శ్రీజకు, శిరీష్‌కు మధ్య చాలా కాలంగా గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ టీవీ చానెల్ ఆ ఇద్దరితో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీజ మాట్లాడిన తీరే ఆ విషయాన్ని పట్టించిందని అంటారు. శిరీష్‌తో ప్రేమ వ్యవహారంపై మాట్లాడడానికి కూడా ఆమె నిరాకరించారు. అదంతా తన వ్యక్తిగతమని కొట్టి పారేశారు. వాలెంటైన్స్ డే తర్వాత ఫిబ్రవరి 26వ తేదీన బేగంపేటలోని ఓ పబ్‌లో కలిసి కనిపించారు. ఆనందంగా ఉన్నట్లు కనిపించడానికి ప్రయత్నించారు. గోవాకు చెందిన మేనేజ్‌మెంట్ కంపెనీతో శిరీష్ ఒప్పందం చేసుకోవడానికి జరిగిన కార్యక్రమం అది. టిటో గ్లోబల్ ఈవెంట్స్ కార్యక్రమాలను హైదరాబాదులో నిర్వహించడానికి శిరీష్ భరద్వాజ్ చేసుకుంటున్న ఏర్పాటు అది.

ఆ కంపెనీలో శిరీష్ మూడు నాలుగు నెలల క్రితేమే అందులో చేరాడు. తన మామగారు సినీ రంగంలో అగ్ర హీరో కాబట్టి తన వ్యాపారానికి సినీ ప్రముఖులను వాడుకోవడానికి ప్రయత్నించాడు. అయితే శ్రీజ అనుకున్నదొకటి, జరిగిందొకటి. దీంతో ఆమె తీవ్ర నిరాశకు గురైనట్లు చెబుతారు. శిరీష్‌ను దగ్గరకు తీసుకోవడానికి చిరంజీవి ఏ మాత్రం ఇష్టపడలేదని, శిరీష్ పట్ల అతని అభిప్రాయం ఏ మాత్రం మారలేదని అంటారు. శ్రీజను ఇంట్లోకి రానిచ్చినప్పటికీ, శిరీష్‌ను చిరంజీవి దూరంగానే పెట్టారని అంటారు. దాంతో తరుచుగా శ్రీజ తండ్రికి రావడం సాగించారు. పలు కుటుంబ కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొంటూ వచ్చారు. చిరంజీవి తండ్రి చనిపోయినప్పుడు 2007లో మొదట శ్రీజ తన తండ్రి నివాసంలో కనిపించారు.

తాను లేకుండా తన భార్య ఒక్కతే చిరంజీవి ఇంటికి వెళ్తుందని, ఇక ముందు కూడా అలాగే జరుగుతుందని శిరీష్ భరద్వాజ్ గట్టిగా నమ్ముతూ వచ్చాడు. 2008లో శ్రీజ కూతురికి జన్మనిచ్చినప్పుడు చిరంజీవి మినహా తల్లి సురేఖ, సోదరుడు రామ్ చరణ్ తేజ వచ్చి చూసి వెళ్లారు. చిరంజీవి తమను పట్టించుకోకపోవడంపై శిరీష్ తీవ్ర అసంతృప్తికి గురవుతూ వచ్చాడని అంటారు. దానికితోడు, తల్లిదండ్రులకు శ్రీజ దగ్గరవుతూ వచ్చారు. ఈ స్థితిలోనే శ్రీజకు చిరంజీవి కుటుంబ సభ్యులు కౌన్సెలింగ్ చేస్తూ వచ్చారని చెబుతూ వచ్చారు. శిరీష్‌ను ప్రేమించి, పెళ్లి చేసుకోవడం ఆమె తండ్రికి ఎంతగా కోపం కలిగించిందో కూడా వివరిస్తూ వచ్చారని చెబుతూ వచ్చారు. చెప్పాలంటే, శ్రీజకు బ్రెయిన్ వాష్ చేశారు. దీంతో వరకట్నం వేధింపులు పక్కన పెడితే, శ్రీజ శిరీష్‌కు దూరమవుతూ తన కుటుంబానికి దగ్గరవుతూ వచ్చిందని చెబుతారు. దీంతోనే ఆమె పూర్తిగా శిరీష్‌ను దూరం చేసుకోవడానికి సిద్ధపడినట్లు సమాచారం.

English summary
When school girl Srija practiced her game of badminton at the Lal Bahadur stadium, her friends were often pleasantly surprised. Srija's father, megastar Chiranjeevi, the most popular hero of the Telugu film industry, would drop by to check on his daughter's skills at the game.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X