కెసిఆర్‌ను బలహీనపరుస్తున్నారా?

నిజానికి, నమస్తే తెలంగాణ దినపత్రిక పూర్తిగా కెసిఆర్ చేతుల నుంచి జారిపోయినట్లు తెలుస్తోంది. ఈ పత్రికను లక్ష్మీరాజం పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పత్రిక వ్యవహారానికి, పోలవరం టెండర్ల ఖరారుకు ముడి పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు కెసిఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ వ్యవహారాన్ని అవసరమైతే కెసిఆర్‌పై ప్రయోగించడానికి కాంగ్రెసు పార్టీ ఆయుధంగా తన వద్ద ఉంచుకున్నట్లు భావిస్తున్నారు. కెసిఆర్‌ను దెబ్బ తీయడానికి అవసరమైతే ఆ ఆయుధాన్ని తీయడానికి కాంగ్రెసు వెనక్కి తగ్గకపోవచ్చునని అంటున్నారు.
మొత్తం వ్యవహారంలో కాంగ్రెసు అధిష్టానం లేదా కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ ఎనిమిదో అధ్యాయాన్ని అమలులో పెట్టినట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే కెసిఆర్‌ను చిక్కుల్లో పడేశారని కూడా చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఈ స్థితిలోనే కాంగ్రెసు అధిష్టానం వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుని ప్రకటించడానికి సిద్ధపడిందని చెబుతున్నారు. తాము ఏం చేసినా ఇప్పుడు చెల్లుబాటు అవుతుందని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ తెలంగాణ నాయకులను అదుపు చేసుకోగలిగితే కెసిఆర్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా అనుకుంటున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications