సంక్షోభం వెనుక వైయస్ జగన్?

టి-కాంగ్రెసు సంక్షోభం వెనుక జగన్ కనిపించనప్పటికీ ఆయన హస్తం ఉందని భావించే వారున్నారు. విధానసభ పరంగా తాను ప్రభుత్వాన్ని పడగొట్టలేక పోయినప్పటికీ టి-కాంగ్రెసును రెచ్చగొట్టి రాజీనామాలు చేయించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే స్కెచ్ జగన్ వేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణపై అధిష్టానం జూలై 1లోపు తేల్చకుంటే రాజీనామా చేస్తామన్న టి-కాంగ్రెసు హెచ్చరికల నేపథ్యంలో వారి హెచ్చరికలతో జగన్ పొలిటికల్ గేమ్ అడినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 1న సమావేశమైన టి-కాంగ్రెసు సమావేశంలో పలువురు జగన్ వర్గ తెలంగాణ కాంగ్రెసు నేతలు రాజీనామాకు పట్టుబట్టినట్లుగా సమాచారం. అంతకుముందు వరకు టి-కాంగ్రెసు మొదట అధిష్టానంపై ఒత్తిడి తీసుకు వచ్చి ఆ తర్వాత రాజీనామాలు చేయాలని నిశ్చయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే సమావేశంలో జగన్ వర్గం రాజీనామాలకు పట్టుబట్టినట్లుగా తెలుస్తోంది.
సమావేశం జరుగుతుండగా తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి నేతలు రావడం, వారితే రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు వేరుగా చర్చలు జరపడం, వెంటనే రాజీనామాల నిర్ణయం తీసుకోవడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయంట. మరో రెండు మూడు రోజుల్లో ఇడుపులపాయలో వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ మొదటి ప్లీనరీ ఉంది. ఈ ప్లీనరీలోగా రాష్ట్రంలో సంక్షోభం సృష్టించి ఎన్నికలు వచ్చే విధంగా చేయాలనే ఉద్దేశ్యంతో జగన్ తన వైపు ఉన్న టి-కాంగ్రెసుతో చాతుర్యం ప్రదర్శించాడనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్లీనరీలో జగన్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా తీసుకోక పోయినా సీమాంధ్రలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఆయన పార్టీ భారీగా సీట్లు కైవసం చేసుకోవడం ఖాయం. ఎంత ఆలస్యమైతే అంత నష్టం అని జగన్ భావించినట్లుగా తెలుస్తోంది. అందువల్లే నేరుగా ప్రభుత్వాన్ని పడగొట్టలేని జగన్ తెలంగాణ నుండి నరుక్కొచ్చినట్లుగా తెలుస్తోంది.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!!












Click it and Unblock the Notifications