పురంధేశ్వరిపైనే ఎంపీల అక్కసు?

Purandeswari
తమకు మంత్రివర్గంలో చోటు లభించకపోవడం సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు తీవ్రంగా మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తోంది. మంత్రివర్గంలో చోటు లభించని ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు గురువారం సాయంత్రం 4 గంటలకు కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జీతో జరిగే భేటీకి కూడా గైర్హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. ఆయనతో పాటు పలువురు ఎంపీలు గైర్హాజరీ అయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని తన సన్నిహితులతో ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే సీమాంధ్ర ఎంపీలు ఆయనను బుజ్జగిస్తున్నట్లు సమాచారం. తాను ఇప్పటికి ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యానని, అయితే పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి మంత్రి పదవులు ఇస్తూ తమకు ఇవ్వకటం లేదని పరోక్షంగా పురంధేశ్వరిని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు మంత్రివర్గంలో చోటు లభించకపోవటంపై మీడియా ముందే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మంత్రివర్గ విస్తరణలో సరియైన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఉంటుందని చెప్పారు. అధిష్టానం రాష్ట్రానికి సరియైన ప్రాధాన్యం ఇవ్వకుంటే మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పట్టుసాధించే అవకాశం ఉందన్నారు. 2004నుంచి సీమాంధ్రకు పదవి ఇవ్వలేదని, కాంగ్రెస్‌లో రెడ్లకు తప్ప వేరేవారికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు.

పురంధేశ్వరికి మంత్రి పదవి ఇవ్వడంపో సీమాంధ్ర ఎంపీలకు లోలోన గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. రాయపాటి, కావూరి, పురంధేశ్వరి ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావటం, వారికన్నా పురంధేశ్వరి పార్టీలోకిగానీ, రాజకీయంలోకి గానీ ఆలస్యంగా వచ్చినప్పటికీ మంత్రి పదవులు పొందడంపై వారు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పురంధేశ్వరిని కాదని పార్టీ ముందుకు పోయే పరిస్థితి లేదు. ఆమె ఎన్టీఆర్ కూతురు కావటం ఒకటి అయితే, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో ఉన్న అనుబంధం దృష్ట్యా ఆమెను కేబినెట్‌కి దూరం పెట్టే అవకాశాలు లేవు. దీంతో వారు తమను కాదని, పురంధేశ్వరికి మంత్రిపదవి ఇవ్వడంపై గుర్రుగానే ఉన్నట్లు తెలుస్తోంది.

32మంది ఎంపీలున్న రాష్ట్రానికి ఒకే కేబినెట్ పదవి ఇవ్వడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణకు చెందిన జైపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం, కోస్తాంధ్రకు చెందిన పల్లంరాజు, పురంధేశ్వరి, పనబాక లక్ష్మిలకు, సీమకు చెందిన సాయిప్రతాప్‌కు మాత్రమే మంత్రి పదవులు ఇవ్వడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ భేటీకి సహాయ నిరాకరణతో తమ అసంతృప్తి తెలియజేయాలని వారు యోచిస్తున్నారు. 2004నుంచి సీమాంధ్రకు సరియైన మంత్రి పదవులు లేవని వారు ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+