జగన్‌కు బెంబేలెత్తిన కిరణ్ కుమార్ రెడ్డి?

ప్రభుత్వ కదలికపై వార్తలు వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉలిక్కిపడ్డారు. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం లేదనే అపవాదు నుంచి బయటపడడానికి ఇదే తగిన సమయం అని ఆయన అనుకుని ఉంటారు. దాంతో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనకు నోటీసు ఇచ్చారు. మొదటి నోటీసు చెల్లదని గ్రహించి రెండో రోజు కూడా నోటీసు ఇచ్చారు. కానీ దాన్ని ప్రోటెం స్పీకర్ గానీ ఆ తర్వాత ఎన్నికైన స్పీకర్ గానీ పట్టించుకోలేదు. ఆ నోటీసు తన దృష్టికే రాలేదని ఇప్పటికీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అంటున్నారు. ఇలా అంటుండగానే శానససభ ప్రోరోగ్ అయింది. ఇక అవిశ్వాస తీర్మానం ఇప్పట్లో చర్చకు వచ్చే అవకాశం లేదని స్పష్టంగా తేలిపోయింది.
వాస్తవానికి, కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభలో బలనిరూపణకు సిద్ధపడాలనే అనుకున్నారు. అయితే, జగన్ తన జెరూసలేం పర్యటనను వాయిదా వేసుకుని శాసనసభ్యులను కూడగట్టే పనిలో మునిగిపోయారు. ప్రభుత్వాన్ని కూల్చి తీరాలనే పట్టుదలతో ఆ పనికి పూనుకున్నారు. జగన్ ఏర్పాటు చేసిన సమావేశానికి 24 మంది శాసనసభ్యులు హాజరు కావడం, ఆయన వెంట కచ్చితంగా 34 మంది సభ్యులు ఉన్నారని తేలడం, 55 మంది శాసనసభ్యులను కూడగట్టాలనే ప్రయత్నంలో జగన్ ఉండడం వంటి పరిణామాల నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి కంగు తిన్నారని అంటున్నారు. ఈ స్థితిలోనే జగన్‌కు బయపడి బలపరీక్షను తప్పించుకున్నారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications