డిఎంకెకు ఖుష్బూ జిలుగులు

Kushboo
తమిళ బొద్దుగుమ్మ ఖుష్బూ త్వరలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననుంది. త్వరలో పశ్చిమబెంగాల్, అసోం, కేరళతో పాటు తమిళనాడు, పుదుచ్చేరిలలో కూడా అసెంబ్లీ ఎన్నికలు ఉన్న విషయం తెలిసిందే. అయితే తమ తమ పార్టీలను గెలిపించుకోవడానికి ఆయా పార్టీలు ప్రజాకర్షణ ఉన్న నేతలను మాత్రమే కాకుండా సినిమా రంగంలోని వారిని కూడా ప్రచారానికి వినియోగించుకోవడం తెలిసిందే. అయితే ఖుష్బూ ముఖ్యమంత్రి కరుణానిధి నేతృత్వంలోని ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొననుంది. ఖుష్పు ఈ నెల 25వ తారీఖునుండి ఏప్రిల్ 11వ తారీఖు వరకు ప్రచారం చేస్తారని తెలుస్తోంది.

అంతేకాదు డిఎంకె గెలుపు కోసం తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలో కూడా ఆమె ప్రచారం చేస్తారని తెలుస్తోంది. అయితే ఆమె ప్రచారం డిఎంకెకు ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి. తమిళనాడు ఎన్నికలలో కాంగ్రెసు తరఫున ప్రచారం చేస్తానని చిరంజీవి సోమవారమే ప్రకటించారు. చిరంజీవి తెలుగు వారు ఎక్కువగా ఉండే ప్రాంతంలోనే కాకుండా పార్టీ అదేశిస్తే మిగిలిన ప్రాంతాల్లో కూడా ప్రచారం చేస్తానని చెప్పారు. విజయ్‌కాంత్ తదితరులు కూడా సినిమా నుండి రంగంలోకి దిగుతారు.

ఖుష్బూ డిఎంకే పార్టీలో ఇటీవలే ఆ పార్టీ అధ్యక్షుడు కరుణానిధి ఆధ్వర్యంలో చేరింది. గత సంవత్సరం మే 15వ తారీఖున ఆమె పార్టీలో చేరింది. అయితే అంతకుముందు ఆమె కాంగ్రెసు పార్టీలో చేరతారనే వాదనలు వినిపించాయి. అయితే కరుణానిధి మంచి రచయిత. అయనకు సినీరంగంతో మంచి పరిచయాలున్నాయి. ఈ పరిచయాల కారణంగా ఖుష్బూ కాంగ్రెసులో కాకుండా డిఎంకెలో చేరింది. కాగా జయలలితకు దూరం జరిగిన వైగోతో కలిసి ఎన్నికలను ఎదుర్కొనడానికి భారతీయ జనతా పార్టీ సంసిద్ధత వ్యక్తం చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+