రజనీకాంత్ చనిపోయాడంటూ ఆన్‌లైన్‌లో బ్లాగర్ల ప్రచారం

ఇటువంటి అవాస్తవిక కధనాలను చూసి ఆశ్చర్యపోయిన రజనీకాంత్ కుటుంబ సభ్యులు చివరకు అతని ఆరోగ్యంపై ఓ అధికారిక ప్రకటనను వెల్లడించారు. వారు తెలిపిన దాని ప్రకారం.. రజనీకాంత్ ఆరోగ్యం మెరుగ్గా ఉందని, అతను ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి రూమర్లు ఎక్కడి నుండి ప్రారంభమవుతున్నాయో తనకేం అర్థం కావడం లేదని, ఇవన్నీ అవాస్తవాలని, అతను మంచి ఆరోగ్యంతో ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారని రజనీకాంత్ సతీమణి లతా మీడియాకు వివరించారు. రజనీకాంత్ అభిమానులు మాత్రం ఇలాంటి వార్తలను సీరియస్‌గా తీసుకుంటున్నారు.
రజనీకాంత్‌కు పిచ్చి అభిమాని అయిన షలీన్ అస్ఘర్ స్పందిస్తూ.. బ్లాగర్లు ఇలాంటి కథనాలను ప్రచురించే టప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, నిజానిజాలు తెలుసుకోకుండా రూమర్లు పుట్టించడం సరికాదని, ఇది అభిమానుల మనోభావాలను దెబ్బతీస్తుందని అన్నారు. అభిల్ దాస్ అనే మరో అభిమాని కూడా ఇదే విధంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ స్టుపిడ్ రూమర్లను చూసి షాక్ గురయ్యానని, రజనీ గారు ఓ సూపర్‌స్టార్ మరియు ఎంతో గౌరవించదగిన వ్యక్తి అని చెప్పారు. ఇలాంటి భూటకపు కధనాలను ప్రచారం చేయడం ద్వారా వారేం సాధిస్తారో తెలియడం లేదని అన్నారు.