తెలంగాణ ఇష్యూ: కెకె ట్రాప్‌లో కెసిఆర్

K Chandrasekhar Rao-K Keshav Rao
తెలంగాణ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కాంగ్రెసు తెలంగాణ ప్రాంత సీనియర్ నేత కె. కేశవరావు ట్రాప్‌లో పడ్డారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కె. కేశవరావును ఆలంబనగా చేసుకుని కాంగ్రెసు అధిష్టానంపై తెలంగాణ కోసం ఒత్తిడి తేవాలని అనుకుంటున్నకెసిఆర్ వ్యూహం ఎదురు తిరిగినట్లు కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమం కీలకమైన దశకు చేరుకున్న సమయంలో కెసిఆర్ కేశవరావుతో భేటీ కావడం వెనక్కి తగ్గడం ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ వస్తున్నది. తెలంగాణ కోసం పోరాడే కాంగ్రెసు నాయకుల్లో కేశవరావు అతివాదిగా మారిపోయారు. పార్టీ అధిష్టానానికి అత్యంత సన్నిహితుడిగా మెలిగిన కేశవరావు ఇప్పడు స్వపక్షంలో విపక్ష పాత్ర పోషిస్తున్నారు.

కేశవరావుకు జనబలం లేకపోయినప్పటికీ తన పదునైన వ్యూహాల ద్వారా నరుక్కురావడం అలవాటు అంటారు. దాని ద్వారానే తెలంగాణలో తెరాసను బలహీనపరిచి, కాంగ్రెసు పైచేయి సాధించడానికి అవసరమైన వ్యూహాన్ని కేశవరావు చాలా కాలంగా అమలు చేస్తున్నారని అంటున్నారు. కాంగ్రెసులోని పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి అతివాదుల ద్వారా కేశవరావు నరుక్కుని వస్తున్నారని అంటున్నారు. ఐక్యంగా ముందుకు సాగుతామని అంటూనే తెరాసకు, తెలంగాణ జెఎసికి కాంగ్రెసు తెలంగాణ నేతలు దూరం పాటిస్తూ వస్తున్నారు. తెలంగాణ జెఎసి ఇచ్చిన ఆందోళనల్లో తమది ప్రధాన పాత్ర అయ్యేలా వ్యవహరిస్తున్నారు. ఇటీవలి రైల్ రోకో కార్యక్రమంలో కాంగ్రెసు పార్లమెంటు సభ్యుల అరెస్టు, వారిపై నాన్ బెయిలబుల్ కేసుల నమోదు వంటి అంశాలు కాంగ్రెసును తెరాసపై పైచేయి సాధించేలా చేసింది. కేశవరావును నమ్ముకుని కెసిఆర్ వ్యూహాలు మారుస్తుండడమే తెరాసకు ప్రాణసంకటంగా మారిందని చెబుతున్నారు. దానివల్లనే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని సమాచారం.

తెలంగాణ కోసం ఎంత దూరమైనా పోతామంటూనే కాంగ్రెసు తెలంగాణ నాయకులు ఒక్కో నెల వాయిదా వేస్తూ వస్తున్నారు. నెలాఖరు, నెలారంభం అంటూ డెడ్‌లైన్లను మారుస్తూ వస్తున్నారు. తాజాగా, కాంగ్రెసు తెలంగాణ నాయకులు నవంబర్ మొదటి వారం చెబుతున్నారు. నవంబర్ మొదటివారంలో తెలంగాణపై నిర్ణయం వెలువడుతుందని చెబుతున్నారు. తెలంగాణకు అనుకూలంగా తమ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోబోతున్నట్లు సంకేతాలు అందాయని కేశవరావు మంగళవారం సాయంత్రం వ్యూహాత్మకమైన ప్రకటన చేశారు. తెరాసకు దీటుగా తెలంగాణలో కాంగ్రెసు బలం పుంజుకోవడానికి అవసరమైన వ్యూహాన్ని కేశవరావు చేతుల మీదుగా అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇది గమనించే తెలంగాణ రాజకీయ జెఎసి కాంగ్రెసును టార్గెట్ చేసుకుని ఉద్యమ కార్యాచరణకు పూనుకుంటామని ప్రకటించినట్లు చెబుతున్నారు. తమను టార్గెట్ చేసుకుంటామని తెలంగాణ జెఎసి ప్రకటించగానే కాంగ్రెసు తెలంగాణ స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించి కాస్తా దూకుడుగా ముందుకు వస్తున్నట్లు చెబుకున్నారు. తెరాస వ్యూహంలో కొట్టుకుపోకుండా, తెరాసకు బ్రేకులు వేసే పద్ధతిలోనే కాంగ్రెసు తెలంగాణ నాయకులు వ్యవహరిస్తున్నారనే మాట వినిపిస్తోంది. ఇది ఏ రూపం తీసుకుంటుందో చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+