• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బొత్స దూకుడుకు కిరణ్ చెక్ చెప్పగలడా?

By Srinivas
|

Botsa Satyanarayana
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి, మాజీ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ జోడెడ్లుగా కలిసి గత రెండు ఎన్నికలలో కాంగ్రెసును అధికారంలోకి తెచ్చారు. అయితే వారి మధ్య విభేదాలు లేక పోలేదు. అయినప్పటికీ వరుసగా రెండుసార్లు కాంగ్రెసు వారి ఆధ్వర్యంలో అధికారాన్ని చేపట్టింది. ఇప్పుడు ఆ జోడెడ్లు మారాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ జోడెడ్లుగా మారారు. రానున్న 2014 ఎన్నికల్లో వారిద్దరూ సమన్వయంతో పార్టీని గెలిపిస్తారా లేదా అనే విషయంపై ప్రస్తుతం కాంగ్రెసు కార్యకర్తల్లో ఉన్న అనుమానం. అయితే ముఖ్యమంత్రి కిరణ్ తనపై ఇన్నాళ్లుగా వచ్చిన విమర్శలను అర్థం చేసుకొని మారినట్లుగా కనిపిస్తున్నారు. ఇక బొత్స పిసిసి అధ్యక్షుడిగా మారాక కాంగ్రెసులో కొత్త ఉత్సాహం వచ్చిందని చెప్పక తప్పదు. దూకుడుగా వ్యవహరించడమే కాకుండా, నిర్ణయాలను శరవేగంగా తీసుకునే ఆయన వ్యవహార శైలి కారణంగా గాంధీ భవన్‌లో, రాష్ట్ర కాంగ్రెసులో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే వైయస్ మరణం తర్వాత పూర్తి నిస్తేజంలో ఉన్న కాంగ్రెసు ఇప్పుడు సరికొత్త ఉత్సాహంతో కనిపిస్తోంది.

అయితే పిసిసి అధ్యక్షుడు సత్తిబాబు, సిఎం ఏ స్థాయిలో సమన్వయం అయి పార్టీని ముందుకు తీసుకు వెళతారనే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. బొత్స పిసిసి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం నేపథ్యంలో అటు కిరణ్‌, ఇటు బొత్స చేసే ప్రయత్నాల్లో ఎవరిది పై చేయి అవుతుందన్న ఆసక్తి పార్టీ నేతల్లో కనిపిస్తోంది. గతంలో డిఎస్, వైయస్ సమన్యంతో పని చేస్తున్నామని చెప్పినప్పటికీ వైయస్‌దే పై చేయి అవుతూ వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ సంప్రదాయం ప్రకారం సిఎంను వ్యతిరేకించే నేతకు పిసిసి పగ్గాలు ఇవ్వడం ఆనవాయితీ. పార్టీని, అధిష్టానాన్ని తన దారిలోకి తెచ్చుకున్న వైయస్ కూడా తన అనునయులకు పిసిసి పగ్గాలు ఇప్పించుకోలేక పోయాడంటే అర్థం చేసుకోవచ్చు. డిఎస్ రెండుసార్లు పిసిసి అధ్యక్షుడిగా చేసినప్పటికీ వైయస్‌పై పైచేయి సాధించలేక పోయారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పార్టీలో ఆధిపత్యపోరు అంశంపై చర్చ మొదలయింది. గతంలో వైఎస్‌ సిఎంగా ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడిని నామమాత్రా విశిష్టంగా చూసేవారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కొత్త పిసిసి అధ్యక్షుడు బొత్స విషయంలో కూడా వైఎస్‌ విధానాన్నే అనుసరిస్తారా అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. సిఎంకు అధిష్ఠానం వద్ద పలుకుబడి పెరగకపోగా, ఆయన పనితీరుపై అసంతృప్తితో ఉంది. కిరణ్‌ ప్రభుత్వం క్లిష్ట పరిస్థితి లోనే ఉందంటూ ఇటీవల ఆజాద్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. జగన్‌, తెలంగాణ అంశాల్లో కిరణ్‌ విఫలమయ్యారన్న అభిప్రాయంతో పాటు, ఆయన ఎవరితోనూ సమన్వయం చేసుకోవడం లేదన్న అభిప్రాయంతో ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్‌ మాదిరిగా కిరణ్‌ అధిష్ఠానంపై ఒత్తిడి చేసే పరిస్థితిలో లేరని స్పష్టమవుతూనే ఉంది.

నాదెండ్ల మనోహర్‌కు స్పీకర్‌, చక్రపాణికి విధానమండలి చైర్మన్‌ పదవి రాకుండా సిఎం ఎంతగా ప్రయత్నించినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య సిఫారసుతో వారిద్దరికే ఆ పదవులు దక్కాయి. అంటే రోశయ్యకు ఇస్తున్న ప్రాధాన్యంలో కిరణ్‌కు సగం కూడా ఇవ్వడం లేదని స్పష్టమవుతూనే ఉంది. ఈ ప్రకారంగా చూస్తే బొత్సను నియంత్రించడం కూడా కిరణ్‌కు కష్టంగానే కనిపిస్తోంది. కార్పొరేషన్‌ పదవుల విషయంలో సైతం కిరణ్‌-బొత్స మధ్య యుద్ధం తప్పేలా లేదు. పార్టీపై పట్టు బిగించేందుకు ఉన్న వేదికల్లో ప్రధానమైన కార్పొరేషన్‌ పందేరాల్లో ఇద్దరూ తమదే పైచేయి కావాలన్న తపనతో ఎత్తులు వేయక తప్పదు. పీసీసీ నుంచి బొత్స కూడా ఒక జాబితా రూపొందించి, దానిని అధిష్ఠా నానికి సమర్పించడం ఖాయం. ఈ క్రమంలో వారిద్దరి జాబితాలో ఎవరిది పై చేయి సాధిస్తే, భవిష్యత్తు రాష్ట్ర రాజకీయా ల్లో వారిదే పైచేయికాక తప్పదు. ముఖ్యమంత్రిని కేవలం పరి పాలనకే పరిమితం చేసి, పార్టీపరమైన అంశాలలో బొత్సకు పెత్తనం ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. బొత్స భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలన్న లక్ష్యంతో ఉన్నం దున పార్టీకి సంబంధించిన నిర్ణయాల్లో కిరణ్‌ను పక్కకుపెట్టి, దూకుడుగా వెళ్లి అధిష్ఠానం దృష్టిలో పడేందుకు ప్రయత్నించడం ఖాయం.

English summary
"Will CM Kiran Kumar Reddy put check to PCC president Botsa Satyanarayana?" - this question raise now in congress party leaders and activists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X