జగన్ ఇష్యూ: కిరణ్‌పై హైకమాండ్ సీరియస్

నిజానికి, వైయస్ జగన్ వెంట కేవలం 18 మంది శానససభ్యులు మాత్రమే ఉంటారని ముఖ్యమంత్రి అంచనా వేశారని అంటున్నారు. ఆ సంఖ్య కూడా తగ్గుతుందని ఆయన చెప్పారట. అయితే, సమస్య ముదిరి జగన్‌పై సిబిఐ దర్యాప్తు సాగుతున్న క్రమంలో ఆ సంఖ్య 29కి చేరుకుంది. వారిలో 26 మంది శాసనసభ్యులు రాజీనామాలు చేశారు. మిగతా ముగ్గురు కూడా జగన్ వెంటే ఉన్నప్పటికీ రాజీనామాలు చేయలేదు. ఈ సంఖ్యను తగ్గించడంలో కిరణ్ కుమార్ రెడ్డి చర్యలు ఫలితాలు ఇవ్వలేదనే అసంతృప్తితో అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు.
ఆ సమస్య అలా ఉండగానే వైయస్ జగన్ వైపు మరో పది, 13 మంది వెళ్తారనే వార్తలు వచ్చాయి. జగన్ వర్గం ఆ విషయాన్ని ప్రచారంలో పెట్టింది. వివిధ కారణాల వల్ల మరింత మంది కూడా జగన్ వైపు వెళ్లడానికి సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, జగన్ భవిష్యత్తుపై ఆందోళనతోనే వారు అటు వెళ్లడం లేదు తప్ప అందులో కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిభ ఏమీ లేదని అంటున్నారు. వైయస్ జగన్ విమర్శలు తిప్పికొట్టడంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి ప్రదర్శిస్తున్న వైఖరి ప్రోత్సాహకరంగా లేదని అంటున్నారు. ఏమైనా, రోశయ్య నుంచి ముఖ్యమంత్రి పగ్గాలు తీసుకున్న తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి పెద్దగా పార్టీనీ, ప్రభుత్వాన్నీ గాడిలో పెట్టిన దాఖలు ఏవీ లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications