వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేయిచ్చిన ఎమ్మెల్యేలకు జగన్ షాక్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
తన మాటకు కట్టుబడి శానససభ్యులపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. కాంగ్రెసుకు అనుకూలంగా ఓటేసి తన వైపు తిరిగి వస్తానంటే కూడా ఆయన అంగీకరించే స్థితిలో లేరని అంటున్నారు. అవిశ్వాసానికి మద్దతుగా ఓటేసిన పక్షంలో అనర్హత వేటు పడితే ఉప ఎన్నికల్లో గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చిన తర్వాత కూడా కాంగ్రెసు వైపు వెళ్లడానికి కొంత మంది శానససభ్యులు మొగ్గు చూపడం పట్ల ఆయన తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. శాసనసభ్యురాలు కుంజా సత్యవతి భర్త ధర్మపై వేటు వేయడాన్ని అందుకు సంకేతంగా చెబుతున్నారు. ఖమ్మం జిల్లా పార్టీ కన్వీనర్‌గా ఉన్న ధర్మపై వైయస్ జగన్ సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో కుంజా సత్యవతి ఒక్కసారిగా కంగు తిన్నట్లు కనిపించారు.

జగన్ అంటే అభిమానమని చెబుతూ వచ్చిన సత్యవతి తన భర్తపై వేటు పడగానే మరో విధంగా ప్రతిస్పందించారు. జగన్ ఏకపక్ష వైఖరి నచ్చకపోవడం వల్లనే తాను తిరిగి కాంగ్రెసులోకి వచ్చానని ఆమె చెప్పారు. తనతో ఉంటూ వస్తున్న కొంత మంది శాసనసభ్యులు డబుల్ గేమ్ ఆడుతున్నారని జగన్ కూడా గ్రహించారు. దానికి స్వస్తి చెప్పాలని ఆయన సూచించారు. తనతో చిత్తశుద్ధితో ఉండేవాళ్లే ఉండాలని, డబుల్ గేమ్‌ ఆడుతున్నవారు తన వద్దకు రావాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టంగానే చెప్పారు. ఆ తర్వాత కూడా కొంత మంది ఇటూ అటూ ఉంటూ ఎటు ఉంటారో తెలియకుండా వ్యవహరిస్తున్నారు.

వైయస్ జగన్ వెంట ఉండి, ఇప్పుడు ప్రభుత్వం వైపు తిరిగి వచ్చిన శాసనసభ్యులకు భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఉంది. తాము కాంగ్రెసుకు అనుకూలంగా ఓటేసినా తర్వాత జగన్ వైపు రావచ్చునని వారు అనుకుంటున్నారు. కానీ, అటువంటి వారిని భవిష్యత్తులో కూడా రానీయకూడదని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాంగ్రెసు పార్టీ కూడా వారిని వచ్చే ఎన్నికల్లో పక్కన పెట్టే అవకాశాలున్నాయి. అటు జగన్ వైపు వెళ్లి తమను ఇబ్బందుల్లో పెట్టిన శాసనసభ్యులను ప్రస్తుతం శాసనసభలో గట్టెక్కడానికి వాడుకున్నా తర్వాత వారిని విస్మరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వారు రెంటికి చెడిన రేవడి అయ్యే ప్రమాదమే ఎక్కువగా ఉంది.

English summary
It is clear that YSR Congress party president YS Jagan will act sternly against the MLAs, who are defecting from him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X