జగన్ టార్గెట్ కిరణ్ కుమార్ జిల్లా

YS Jagan
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తదుపరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లాను టార్గెట్ చేసుకోనున్నారు. కర్నూలు జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహిస్తున్న జగన్ తదుపరి చిత్తూరు జిల్లాలో ఓదార్పు యాత్ర చేపట్టాలని అనుకుంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి జిల్లాలో ఓదార్పు యాత్ర చేపట్టడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసరాలనేది జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. చిత్తూరు జిల్లాలోని కాంగ్రెసు శాసనసభ్యులు చాలా మంది ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉన్నారు. దీంతో జగన్ చిత్తూరు జిల్లాలో తన సత్తాను చాటాలని అనుకుంటున్నారు.

కాగా, కర్నూలు జిల్లాలో ఓదార్పు యాత్ర చేసిన తర్వాత తెలంగాణలో చేపట్టాలని ఆయన మొదట అనుకున్నారు. కర్నూలు జిల్లా నుంచి తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలోకి ప్రవేశించాలని తలపెట్టారు. కానీ ఇప్పుడు ఆయన తన మనసు మార్చుకున్నారు. తెలంగాణలో పరిస్థితులు మారనందువల్ల ఇప్పుడే పర్యటన చేయడం అంత మంచిది కాదని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణపై జగన్ తీసుకున్న వైఖరిపై కూడా విమర్శలు ఎదురవుతున్నాయి. తెలంగాణపై తీసుకున్న నిర్ణయం సమైక్యవాదానికి అనుకూలంగానే ఉందని తెలంగాణవాదులు అంటున్నారు. ఈ స్థితిలో తెలంగాణలో ఓదార్పు యాత్ర చేపట్టడం సాధ్యం కాదని అంటున్నారు.

తెలంగాణలో ఓదార్పు యాత్ర చేపడితే తెలంగాణవాదులను రెచ్చగొట్టినట్లవుతుందని, దాని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై తన వైఖరి వెల్లడించే వరకు వేచి చూడాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసు అధిష్టానం పార్టీలో ఇరు ప్రాంతాల నేతల మధ్య ఏకాభిప్రాయ సాధన కోసం సంప్రదింపులు జరుపుతున్న నేపథ్యంలో తెలంగాణ సమస్య ఒక కొలిక్కి రావచ్చునని, అప్పుడే తెలంగాణలో పర్యటనకు ఏర్పాట్లు చేసుకోవచ్చునని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+