వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రజనీకాంత్ సినిమా స్టైల్లో భాను మాస్టర్ ప్లాన్!?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bhanu Kiran
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ సూపర్ స్టార్ రజనీకాంత్ శివాజీ సినిమా స్టైల్లో తన దగ్గరున్న డబ్బులను హవాలా మార్గంలో విదేశాలకు తరలించి, అక్కడి నుండి విరాళాలు, పెట్టుబడుల రూపంలో తిరిగి తెప్పించుకోవాలని భావించాడట. భాను కిరణ్ వద్ద సుమారు వంద కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు తేలిందని సమాచారం. తన వంద కోట్లకు పైగా ఉన్న తన ఆస్తిని వైట్ చేసుకోడానికి శివాజీ సినిమాను అనుసరించాలని భావించాడట.

ఇందుకోసం ప్రత్యేకంగా తన సొంత ఖర్చులతో ఇద్దరు పోలీసు అధికారులను తానా సభలకు పంపించాడట. అక్కడి తెలుగువారితో వారు చర్చించి ఈ ప్లాన్‌ను అమలు చేయాలని చూసే లోపే సూరి హత్య జరగడం.. భాను పరారు కావడంతో అంతా ప్లాన్ అంతా తలకిందులైందట. అనంతపురం జిల్లాలో పాలిటెక్నిక్ చదివిన భానుకిరణ్ సాంకేతికంగా మంచి పరిజ్ఞానం సంపాదించాడు. సూరితో పరిచయం అయ్యాక డాన్‌గా ఎదగాలన్న తన కలను సాకారం చేసుకోవాలనుకున్నాడు.

జైల్లో ఉన్న సూరికి మేళ్లు చేసిపెట్టాలని పాలకుల వద్దకు తిరిగాడు. అప్పుడు ఏర్పడ్డ పరిచయాలతో రాష్ట్రంలో సెజ్‌లు ఎక్కడ పెడుతున్నారో సమాచారం రాబట్టాడు. దీని ఆధారంగా తన గ్యాంగ్‌తో కలిసి సెజ్‌లు వచ్చేచోట భూములు కొనుగోలు చేశాడు. రాష్ట్రంలోని తొమ్మిది చోట్ల ఇలా కొన్నట్లు సిఐడి గుర్తించింది. ఇలాగే పలువురిని బెదిరించి బందరు పోర్టు పరిధిలో 90 ఎకరాల భూమిని తక్కువ ధరకు కొన్నాడు. సిఐడి కస్టడీలో భాను కిరణ్ రోజుకో కొత్త విషయాన్ని వెల్లడిస్తున్నాడు.

ఇప్పటి దాకా అతడు చెప్పినదాన్ని బట్టి దాదాపు రూ.100 కోట్ల ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. వేరే నిర్మాతల పేర్లతో తాను నిర్మించిన నాలుగు సినిమాలే కాక, మరో రెండు సినిమాల విషయంలోనూ భాను పాత్ర ఉన్నట్లు సిఐడి గుర్తించింది. తమిళంలో నిర్మితమై తెలుగులోకి అనువదించిన పోలీస్ పోలీస్ అనే సినిమా హక్కుల విషయం లో ఇబ్బంది తలెత్తితే కల్యాణ్ ల్యాబ్‌లో సెటిల్ చేసినట్లు తెలిసింది.

యువత సినిమా నిర్మాతను కూడా బెదిరించినట్లు భాను వెల్లడించినట్లు సమాచారం. తొమ్మిది రోజుల కస్టడీలో ఇప్పటికే 8 రోజులు పూర్తయిన నేపథ్యంలో భాను కిరణ్‌పై తొమ్మిది కేసులున్నందున ఏదో ఒక దాంట్లో మళ్లీ కస్టడీ కోరాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. కాగా, సియోనీలో అతడు దుర్భర జీవితం ఏమీ గడపలేదు. ఇక్కడి నుంచి తన అకౌంట్లలోకి రూ.లక్షలు డిపాజిట్ చేయించుకున్నాడని దర్యాప్తులో వెల్లడైంది.

దీంతో భానుకు డబ్బు ఇచ్చినవారిని సిఐడి అధికారులు ఒకటి రెండు రోజుల్లో ప్రశ్నించే అవకాశముంది. ఇక సియోనీలో మకాం పెట్టేందుకు భాను అక్కడ ఓ రిసార్టు కట్టించే నెపం చూపాడట. తాను ఎన్నారైనని, ఇక్కడ రిసార్ట్ పెట్టాలని వచ్చానని భాను స్థానికులతో చెప్పాడట.

English summary

 Bhanu Kiran, who is main accused in Maddelachervu Suri murder case, was planned to follow superstar Rajinikanth Sivaji cinema to change is black money to white. But it failed after Maddelachervu suri murder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X