వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసుకు చిరంజీవి ఎప్పటికీ కుంపటేనా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి, ఆయన ప్రజారాజ్యం గ్రూపు కాంగ్రెసుకు ఎప్పటికీ కుంపటిగానే మారనుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను ఎదుర్కోవడానికి కాంగ్రెసు అధిష్టానం చిరంజీవిని చేరదీసింది. తొలుత చిరంజీవి, ఆయన వర్గం కాంగ్రెసు అధిష్టానం పట్ల మెతగ్గా వ్యవహరించినట్లే కనిపించింది. రాను రాను చిరంజీవి పట్టు బిగిస్తున్నారు. తన మాటే నెగ్గాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నారు. మంత్రి పదవుల విషయంలోనే కాకుండా తన వర్గం వారిని మంత్రివర్గంలోకి తీసుకునే ముహూర్తాన్ని కూడా ఆయన ఖరారు చేశారు. ఆ ముహూర్తానికే మంత్రి వర్గ విస్తరణ జరిగేలా చూసుకున్నారు. దాని తర్వాత మంత్రులు సి. రామచంద్రయ్య, గంటా శ్రీనివాసరావులకు అప్పగించే శాఖల విషయంలో పట్టుబట్టి కూర్చున్నారు.

కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసినప్పటికీ వేరే పార్టీ నాయకుల మాదిరిగా షరతులు పెడుతూ, బేరసారాలు ఆడుతూ ప్రత్యేకతను పాటిస్తున్నారు. ఈ వ్యవహారం చూస్తుంటే, చిరంజీవి, ఆయన పార్టీ నాయకులు కాంగ్రెసులో చేరారా, వేరే పార్టీగా ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక రకంగా, అధికారంగా చిరంజీవి కాంగ్రెసు పార్టీలో ఓ ప్రత్యేకమైన వర్గాన్ని నిర్వహిస్తూ, ఒత్తిడి రాజకీయాలకు పాల్పడుతూ ముందుకు సాగుతున్నారు. తన వెంట ఉంటే పదవులు, ప్రయోజనాలు సమకూరుతాయనే సంకేతాలను తన ఒత్తిడి రాజకీయాల ద్వారా పంపుతున్నారు. దీనివల్ల కాంగ్రెసుకు కట్టుబడి దశాబ్దాలుగా పనిచేస్తున్న నాయకులు ఏ విధమైన వైఖరి తీసుకుంటారనేది తెలియకుండా ఉంది.

చిరంజీవి రాజకీయాల తీరు పట్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంతృప్తిగా లేరని భావిస్తున్నారు. వారు కాంగ్రెసు పార్టీకి చెందినవారిగా వ్యవహరించడం లేదని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని ఆయన పార్టీ అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం. అయినా, అధిష్టానం చిరంజీవి మాటకే విలువ ఇస్తోంది తప్ప ప్రభుత్వాన్ని నడుపుతున్న తన మాట వినడం లేదనే అభిప్రాయంతో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు. 2014 ఎన్నికల సమయంలో చిరంజీవి వర్గం టికెట్ల కోసం ఏ విధమైన బేరసారాలకు దిగుతుంది, అది పార్టీపై ఏ విధమైన ప్రభావం చూపుతుందీ అనేది సందేహంగానే ఉంది.

English summary
According to political analysts - Chiranjeevi politics within the party may pose problem always to Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X