చిరుకు రాజపూజ్యం, కిరణ్‌కు రెండూ సమానం

Chiranjeevi-Kiran Kumar Reddy
రాజ్యసభలో అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవికి రాజపూజ్యం ఎక్కువగా ఉంటుందని పంచాంగకర్త కాకునూరు సూర్యనారాయణ మూర్తి చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాజపూజ్యం, అవమానం సమానంగా ఉంటాయట. కిరణ్ కుమార్ రెడ్డికి శత్రువులు తగ్గుతారని పంచాంగకర్త చెప్పారు. నందననామ సంవత్సరంలో మహిళలదే రాజ్యమని గాంధీభవన్ పంచాంగ పఠనంలో పంచాంగకర్త కాకునూరు సూర్యనారాయణమూర్తి చెప్పారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ఈ ఏడాది రాజపూజ్యం, అవమానం సమానంగా ఉంటాయని, ఆదాయం 14, వ్యయం 11గా ఉందని ఆయన వివరించారు. మిధునరాశికి చెందిన కిరణ్‌కు ఈ ఏడాది రాజయోగం బాగా ఉందని చెప్పారు. శత్రువులు తగ్గుతారని, ప్రజాసంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారని వివరించారు.

తులారాశికి చెందిన డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహకు ఆదాయం 11, వ్యయం 14గా ఉందని, రాజపూజ్యం 5, అవమానం 6గా ఉంటుందని అన్నారు. ఈ ఏడాది దామోదరకు పదవిలో వృద్ధి ఉంటుందని చెప్పారు. ధనురాశికి చెందిన చిరంజీవికి ఆదాయం 5, వ్యయం 14గా ఉందని, రాజపూజ్యం 4, అవమానం 2 ఉన్నాయని వివరించారు. ఈ ఏడాది ఆయన పురోభివృద్ధిలో సాగుతారన్నారు.

పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకు ఆదాయం వ్యయం రెండూ 8గానే ఉన్నాయని.. రాజపూజ్యం 3, అవమానం 5గా ఉన్నాయని అన్నారు. ఈ ఏడాది మే 15 వరకు ఒకంత మందగమనంతో ఉన్నా 16 తర్వాత దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయని తెలిపారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ప్రజల ఆరోగ్యం బాగుంటుందని, వ్యవసాయం బాగుంటుందని అన్నారు.

భూముల ధరలు స్థిరంగా ఉంటాయని.. ప్రజలకూ, పాలకులకూ మధ్య సంబంధాలు బాగుంటాయని వివరించారు. ఈ సందర్భంగా పంచాంగకర్తలతో పాటు రాజ్యసభకు ఎన్నికైన చిరంజీవి, ఆనందభాస్కర్, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డిలను సీఎం, పీసీసీ చీఫ్ సన్మానించారు. సీఎం, పీసీసీ చీఫ్‌లను పంచాంగకర్తలు పట్టువస్త్రాలతో ఆశీర్వదించారు. మండలి చైర్మన్ చక్రపాణి, పీసీసీ మాజీ చీఫ్ వీహెచ్, మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు, ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్‌రెడ్డిలను కిరణ్, బొత్స సన్మానించారు. కార్యక్రమంలో మంత్రులు జానారెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, సి.రామచంద్రయ్య, దానం నాగేందర్, ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+