కాళేశ్వర్ బాబా వివాదాల పుట్ట

Kaleshwar Baba
కాళేశ్వర్ బాబా చుట్టూ మొదటి నుంచీ వివాదాలు ముసురుకుంటూనే ఉన్నాయి. విద్యార్థి దశ నుంచే ఆయన ఆధ్యాత్మిక మార్గం పట్టారు. 1992లో అనంతపురం జిల్లా పెనుకొండలో ఆయన ఆశ్రమం స్థాపించారు. ఐదేళ్లలోనే కోట్లకు పడగలెత్తారనే విమర్శలు వచ్చాయి. గుప్త నిధుల తవ్వకాలు సాగించేవారని ఆయనపై ప్రధాన ఆరోపణ ఉన్నట్లు వార్తాకథనాలు వచ్చాయి. ఆ పేరుతో కొందరిని మోసం చేసి లక్షలు ఆర్జించినట్లు చెబుతారు. మడకశిర నియోజకవర్గం గుడిబండలో విగ్రహాల చోరీకి సంబంధించి 1996 సెప్టెంబర్ 6న క్రైం నెం. 38/96గా కాళేశ్వర్‌పై కేసు నమోదైంది.

జనవిజ్ఞాన వేదిక నిజనిర్ధారణ కమిటీ 2002లో కాళేశ్వర్ బాబా ఆశ్రమం ఎదుట ఆందోళనలు చేసింది. ఆధ్యాత్మిక ముసుగులో విదేశీయులకు సకల సౌకర్యాలు కల్పించే స్టార్ హోటల్‌గా ఆశ్రమం కొనసాగుతోందని జేవీవీ సభ్యులు అప్పట్లో ఆరోపించారు. విదేశీయులతో నీలిచిత్రాలు తీస్తున్నారని, స్మగ్లింగ్‌కు ఆశ్రమం అడ్డాగా మారిందని విమర్శించారు. 1996-98 మధ్య పలుమార్లు ఆశ్రమం వద్దకు హెలికాప్టర్ వచ్చేది. దీని ద్వారా డ్రగ్స్ దిగుమతి అయ్యాయనే అరోపణలున్నాయి. మావోయిస్టులు ఆశ్రమంపై బాంబుదాడి చేయగా గుంతకల్లుకు చెందిన ప్రసాద్ అనే వ్యక్తి మృతి చెందాడు.

కాళేశ్వర్ బాబా మృతిపై కూడా వివాదాలు ముసురుకుంటున్నాయి. బుధవారం రాత్రికే కాలేయం పూర్తిగా దెబ్బతిందని, కామెర్లతో మూత్రపిండాలు దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారు. గురువారం ఉదయం కీమోథెరపీతో కొద్దిగా మెరుగుపడినా, కొద్దిసేపటికే కిడ్నీ విఫలం కావడంతో వెంటిలేటర్ ఏర్పాటు చేశామని వైద్యులు వివరించారు. మధ్యాహ్నం ఒంటిగంటకే అవయవాలన్నీ పనిచేయడం మానేశాయన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన తుదిశ్వాస వదిలారన్నారు.

కాళేశ్వర్ మృతదేహాన్ని సాయంత్రం 6 గంటలకు పెనుకొండ తరలించారు. శనివారం ఉదయం 11 గంటలకు ఆశ్రమ ప్రాంగణంలోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు, ట్రస్టు సభ్యులు ప్రకటించారు. కాళేశ్వర్ తుది శ్వాస విడిచినప్పుడు ఆయన భార్య శిల్ప, కుమార్తె నవ్యశ్రీ, నలుగురు మేనత్తలు, ముఖ్యమైన బంధువులు వెంటే ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+