కాంగ్రెస్‌లో 'తెలంగాణ' మంటలు? సిఎంకు అండగా..

Kiran Kumar Reddy - Damodar Rajanarasimha
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై కాంగ్రెస్‌ నాయకత్వం అనుసరిస్తున్న వెైఖరి, తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి తలపెట్టిన కవాతుపై అనుసరిస్తున్న విధానం కాంగ్రెస్‌ నేతల మధ్య చిచ్చు పెట్టినట్లుగా కనిపిస్తోంది. శుక్రవారం నుంచి ఒకరిపై మరొకరు మాటల తూటాలు సంధించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఒకవెైపు తెలంగాణ విషయంలో రెండు, మూడు సార్లు చర్చలు జరిపిన తర్వాత ఏఐసిసి నేత, కేంద్రమంత్రి వయలార్‌ రవి ఈ ప్రాంతం విషయంలో చేసినట్టు చెబుతున్న వ్యాఖ్యలు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహను తీవ్ర ఆగ్రహానికి గురి చేశాయి.

ఫలితంగా తెలంగాణ మార్చ్‌కు అనుమతి విషయంలో ముఖ్యమంత్రిని కలిసేందుకు మంత్రుల బృందంతో సహా వెళ్ళిన ఆయన కిరణ్‌ ఎదుటే వాయలార్ రవిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారట. తెలంగాణపై చర్చలు జరుపుతున్న రవికి తెలంగాణ ఎక్కడుందో తెలియదా అని ఉప ముఖ్యమంత్రి సూటిగా వ్యాఖ్యానించారట. అలాగే తెలంగాణ ఎక్కడ ఉందో తెలియని వారు డిసెంబర్‌ తొమ్మిదిన ఎందుకు ప్రకటన చేశారో చెప్పాలని, అధిష్ఠానం పూటకో రకంగా మాట్లాడుతుంటే పార్టీ గతి ఏమవుతుందని దామోదర ఆ సమావేశంలో సూటిగా ప్రశ్నించారట.

ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై కూడా దామోదర చాలా కాలం నుంచీ గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. ఎవరికీ చెప్పకుండా కిరణ్‌ ప్రకటించిన పథకాలపై కేబినెట్‌ సమావేశాలలోనే అప్పట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పాటు కాంగ్రెస్‌ సమన్వయ కమిటీ సమావేశంలోనూ ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌ సమక్షంలోనే కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇటీవల నేరుగా ఢిల్లీ వెళ్ళి అధిష్ఠానం పెద్దలకే ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై ఫిర్యాదు చేసి వచ్చినట్టు సైతం అక్కడినుంచి వచ్చిన వార్తలు సూచించాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి ఇటీవల చేసిన వ్యాఖ్యలు, తెలంగాణ కవాతుకు అనుమతించే విషయంలో కనబరచిన వెైఖరిని అవకాశంగా తీసుకున్న దామోదర తనదెైన శెైలిలో కిరణ్‌పై మళ్ళీ ఎదురుదాడి ప్రారంభించారన్న అభిప్రాయం పార్టీ వర్గాలలో వ్యక్తమవుతోంది. తెలంగాణ ఉద్యమం ఆత్మగౌరవం, గుండెకోతతో పుట్టిన ఉద్యమమని, 50 ఏళ్లలో 48 ఏళ్లు తెలంగాణేతరులే రాష్ట్రాన్ని పాలించారని ఆయన ఆర్ధ్రతతో చెప్పారు. కడుపు మంటతో గుండె కోతతో కూడిన అంశం తెలంగాణ అన్నారు. సహజంగానే తమ ప్రాంతానికి అన్యాయం జరిగిందనే అనుమానం తమందరిలో ఉందని ఆయన ఘాటైన వ్యాఖ్యలు శుక్రవారం చేశారు.

ఇక కరీంనగర్‌ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్‌ నేరుగా ముఖ్యమంత్రిపెై విరుచుకుపడ్డారు. శుక్రవారం కిరణ్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాలలో తీవ్ర సంచలనం సృష్టించాయి. శుక్రవారం సీనియర్‌ నేత కె కేశవ రావు నివాసంలో మీడియాతో మాట్లాడిన పొన్నం ముఖ్యమంత్రిపెై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీని సమన్వయ పరచాల్సిన నువ్వే తెలంగాణ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందంటున్నావు... ఇక నీకు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే అర్హతలేదు... దిగిపో... ఎప్పుడెైనా తెలంగాణ మంత్రులను పట్టించుకున్నావా.. వారిని పిలిచి పార్టీ గురించి చర్చించావా... ఎవరికీ నీ మీద నమ్మకం లేదని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

ముఖ్యమంత్రిపై పొన్నం చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ప్రాంత మంత్రులు శ్రీధర్‌ బాబు, శెైలజానాథ్‌, సునీతా లక్ష్మారెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ మంత్రులను కిరణ్‌ ఎప్పుడూ చిన్నచూపు చూడలేదని, ఏది చెప్పినా సానుకూలంగా స్పందించారని ఎదురుదాడికి దిగారు. 14 ఎఫ్‌ రద్దు, ప్రాణహిత - చేవెళ్ళ ఒప్పందం లాంటి వాటిని సాధించిన ఘనత కిరణ్‌దే అని కితాబిచ్చారు. విప్‌లు ద్రోణంరాజు శ్రీనివాస్‌, జగ్గారెడ్డి సైతం పొన్నం వ్యాఖ్యలను తప్పు పట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+