• search
  • Live TV
కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

విజయమ్మ సిరిసిల్ల ధర్నా జరిగేనా?

By Pratap
|

YS Vijayamma
కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఈ నెల 23వ తేదీన తలపెట్టిన నేతన్న ధర్నా సజావుగా జరుగుతుందా, లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరకాల సాధించిన ఓట్లతో ఊపు మీద ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణలో పూర్తి స్థాయిలో అడుగు పెట్టి బలం పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే వైయస్ విజయమ్మ సిరిసిల్ల ధర్నా జరుగుతోందని అంటున్నారు. ఆ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేది సిరిసిల్ల ధర్నా తేలుస్తుందని అంటున్నారు.

వైయస్సార్ కాంగ్రెసు వ్యూహాన్ని పసిగట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వైయస్ విజయమ్మ ధర్నాను అడ్డుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. పైగా, సిరిసిల్ల శాసనసభా నియోజకవర్గానికి తెరాస అధినేత కెటి రామారావు ప్రాతినిధ్యం వహిస్తుండడం వల్ల ఇది రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలోనే ఎక్కువ మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారనే వాదనను తెరాస ముందుకు తెస్తోంది. ఒక్క సిరిసిల్లలోనే 78 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు చెబుతోంది.

ఒకవెైపు వెైఎస్‌ విజయమ్మ నేతన్న ధర్నాపేరిట కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటుంటే, తెరాస నాయకత్వం దాన్ని ఢీకొనేందుకు వెైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న కాలంలో సిరిసిల్లలో ఆత్మహత్యలుచేసుకున్న చేనేత కార్మిక కుటుంబ సభ్యులతో అదే రోజున నిరశన దీక్ష చేయించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ రెండు కార్యక్రమాల వేదికలకు మధ్య కేవలం కిలో మీటర్‌కు తక్కువ దూరం మాత్రమే ఉండటంతో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంటుందన్న ఆందోళనతో పోలీసులు ఉన్నట్టు తెలిసింది.

పరకాల ఉప ఎన్నికలో అనూహ్యంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కొండా సురేఖ రెండవ స్థానంలో నిలవటమే కాకుండా తమ అభ్యర్థిని దాదాపు ఓడించినంత పని చేయటంతో టీఆర్‌ఎస్‌ నాయకత్వానికి ఆందోళన కలిగించిందని తెలుస్తోంది. ఇప్పుడు విజయమ్మ ధర్నా సజావుగా సాగనిస్తే దాని ప్రభావం తెలంగాణవాదానికి ఆయువుపట్టుగా ఉన్న కరీంననగర్‌ జిల్లాపై తీవ్రంగా పడుతుందని, అది ఇతర జిల్లాలకు కూడా వ్యాపిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి తమ పని కష్టం అవుతుందని తెరాస నాయకత్వం ఆందోళన చెందుతున్నట్లు చెబుతున్నారు. అందుకే ఎలాగెైనా విజయమ్మ దీక్షను అడ్డుకునేందుకు తెరాస అన్ని ప్రయత్నా లూ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కెటి రామారావు సిరిసిల్లలో మకాం వేసి తెరాస శ్రేణులను సమరానికి సన్నద్ధం చేస్తున్నారు.

వైయస్ విజయమ్మ ధర్నాకు అనుమతి ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని హైకోర్టు పోలీసులకు సూచించింది. ప్రజా సమస్యలపై ధర్నా చేస్తున్నందున అడ్డుకోవద్దని వైయస్సార్ కాంగ్రెసు నాయకులు తెరాసకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నెల 23వ తేదీన గానీ ఏం జరుగుతుందనేది తెలియదు.

English summary
The proposed YSR Congress honorary president YS Vijayamma at siricilla of Karimnagar is creating controversy. dilemma surrounded YS vijayamma's siricilla dharna on handloom weavers plight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X