దిగొచ్చిన జూ.ఎన్టీఆర్: బాబు పాదయాత్రలో...

చంద్రబాబు చేపట్టిన పాదయాత్రకు సంఘీభావంగా ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన సినీ హీరోలు ఒక్కో రోజు ఆ పాదయాత్రలో పాల్గొననున్నారు. నందమూరి బాలకృష్ణ ఒక రోజు, జూనియర్ ఎన్టీఆర్ మరో రోజు యాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలంటున్నాయి. చంద్రబాబు పాదయాత్ర కర్నూలు జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత బాలయ్య చంద్రబాబును కలిసి పాదయాత్రలో కలిసే అవకాశం ఉంది.
చంద్రబాబు పాదయాత్ర అనంతపురం జిల్లాలో ఈ నెల 14వ తేదీతో పూర్తవుతుంది. పదిహేనో తేదీన ఆయన కర్నూలు జిల్లాలో ప్రవేశించి 20వ తేదీ వరకూ యాత్ర నిర్వహిస్తారు. ఆ సమయంలో ఏదో ఒక రోజున బాబు పాదయాత్రలో బాలయ్య పాల్గొంటారు. ఈ నెల 21న చంద్రబాబు పాదయాత్ర మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రవేశిస్తుంది.
తెలంగాణలో బాబు యాత్ర సుమారు యాభై రోజులు సాగనుంది. ఈ సమయంలో తన వీలు బట్టి జూనియర్ ఎన్టీఆర్ ఒకరోజున పాదయాత్రలో పాల్గొంటారు. ఆదిలాబాద్ ఎంపీ రమేష్ రాథోడ్ శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి పాదయాత్ర రూట్ మ్యాప్ చూసుకుంటున్న కంభంపాటి రామ్మోహనరావుతో సమావేశం అయ్యారు.
కాగా తన పాదయాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు గత మూడు రోజుల్లో పలువురు బాధితులకు సాయం చేశారు. పెనుగొండ నియోజకవర్గంలోని సోమందేవపల్లి, సాకర్లపల్లి గ్రామాల్లో అనాథలు, వికలాంగులు, నిరుపేదలు ఏడుగురికి ఆయన రూ.80 వేలు ఆర్థిక సాయం అందించారు.












Click it and Unblock the Notifications