వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ ఢిల్లీ యాత్ర, తెలంగాణపై హాట్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఈ నెల 5వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నారు. గత కొంత కాలంగా ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ధీమా వ్యక్తం చేస్తూ చర్చలకు తనను కేంద్రం ఆహ్వానించిందని చెబుతూ వస్తున్నారు. ఈ ప్రకటన నేపథ్యంలో ఆయన ఢిల్లీ యాత్ర హాట్ టాపిక్‌గా మారింది. ఆయన ఐదో తేదీన ఢిల్లీ వెళ్లి 7వ తేదీన రావాలని అనుకుంటున్నారని, అయితే అక్కడి వాతావరణాన్ని బట్టి మరిన్ని రోజులు ఉండవచ్చునని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఢిల్లీలో ఆయన అధికార కాంగ్రెసు పార్టీకి చెందిన ముఖ్య నాయకులతో కెసిఆర్ సమావేశమవుతారని అంటున్నారు. మూడు రోజుల పాటు ఆ భేటీలు సాగుతాయని సమాచారం. తెలంగాణపై కాంగ్రెసు వైఖరిని తెలుసుకోవడంతో పాటు తెలంగాణకు అనుకూలంగా ప్రకటన వెలువరించకపోతే తాము చేయబోయే ఆందోళనకు సంబంధించిన వివరాలను ఆయన కాంగ్రెసు పెద్దలకు వివరిస్తారని చెబుతున్నారు.

తెలంగాణ ఏర్పాటుపై తమకు పక్కా సమాచారం ఉందని, దాంతోనే తాము ఆగస్టులో జరగాల్సిన పార్టీ సమావేశాలను వాయిదా వేశామని, ఈ నెల 17వ తేదీలోగా కీలకమైన ప్రకటన వెలువడుతుందని తెరాస వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ తెలంగాణకు అనుకూలంగా కేంద్రం ప్రకటన చేయడానికి ముందుకు రాకపోతే ఈ నెల 17వ తేదీన భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణపై ఈ నెల 17వ తేదీన కెసిఆర్ ప్రకటన చేస్తారని అంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో పర్యటించి కాంగ్రెసు మోసాన్ని ప్రజలకు వివరిస్తారని వారంటున్నారు.

ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందుకు వస్తే తెరాసను కాంగ్రెసులో విలీనం చేసే ప్రతిపాదన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఇస్తే కాంగ్రెసులో తెరాసను విలీనం చేసే ఆలోచన కూడా ఉంటుందని తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు ఇటీవల చెప్పారు. తమకు కావాల్సింది తెలంగాణ అనే ఉద్దేశ్యాన్ని తెరాస స్పష్టంగా కాంగ్రెసు ముందు పెడుతున్నట్లు సమాచారం.

English summary
It is said that Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao may hold talks with Congress high command on Telangana issue. He is leaving for Delhi on September 5.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X