'జగన్‌కు లబ్ధి చేకూరుస్తున్న కిరణ్!?'

Kiran Kumar Reddy - YS Jagan
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చర్యలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బలపడటం కోసమే ఉపయోగపడుతున్నాయని రాష్ట్రానికి చెందిన పలువురు కాంగ్రెసు నేతలు అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్లుగా సమాచారం. కాంగ్రెసులోని కొందరు పెద్దలు ఇప్పుడు జగన్ తరఫున శల్యసారథ్యం వహిస్తున్నారని అధిష్టానానికి ఫిర్యాదులు అందుతున్నాయట. అదే సమయంలో మరికొందరు కిరణ్ వైఖరి జగన్‌కు లబ్ధి చేకూరుస్తుందని చెబుతున్నారట. దీంతో కిరణ్ చర్యల పట్ల అధిష్టానం తీవ్ర ఆగ్రహంతో ఉన్నదని తెలుస్తోంది. ఇప్పటికే ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెసు ఘోర పరాజయం నేపథ్యంలో మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, శంకర రావులు వైఫల్యానికి కిరణ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏకంగా ఆయన ముఖ్యమంత్రి స్థానం నుండి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదే సమయంలో కిరణ్ వైఖరి జగన్‌కు అనుకూలంగా ఉందంటూ అధిష్టానానికి ఫిర్యాదులు వచ్చాయనే వార్తల నేపథ్యంలో ఉప ఎన్నికల ఓటమి కంటే పెద్దదైన మరో వివాదం కిరణ్ మెడకు చుట్టుకోనుందని అంటున్నారు. కాంగ్రెసు పార్టీ సీనియర్ నేతలు వి.హనుమంత రావు తదితరులు జగన్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రికి పలుమార్లు సూచించారు కూడా. రాష్ట్రంలోని 'ముఖ్య' నేతలు జగన్ పట్ల కఠినంగా వ్యవహరించడం లేదని పార్టీ నేతలు గతంలో పలుమార్లు ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా ముఖ్యమంత్రి జగన్‌ను విమర్శించిన వారిని కేబినెట్ నుండి తొలగిస్తున్నారని ఆరోపించారు.

జగన్‌పై మొదటి నుండి ఒంటి కాలిపై లేచిన మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి శాఖల కోత, యువనేత ఆస్తులపై విచారణకు కారణమైన శంకర రావును మంత్రి వర్గం నుండి తప్పించడం తదితరాలు వారు ఉదాహరణగా చూపిస్తున్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి జగన్‌పై ఏ సమయంలోనూ విరుచుకుపడిన దాఖలాలు దాదాపు లేవని సొంత పార్టీ వారే అంటున్నారని తెలుస్తోంది. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి జగన్‌పై పలుమార్లు విరుచుకు పడ్డారు. నేతలు కూడా అదే స్థాయిలో స్పందించారు. కానీ కిరణ్ స్పందించిన సందర్భాలు చాలా చాలా తక్కువ అని అంటున్నారు. ఇవన్నీ జగన్‌కు లబ్ధి చేకూర్చేలా ఉన్నాయని పార్టీ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+