వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్సార్సీపి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా షర్మిల?

By Pratap
|
Google Oneindia TeluguNews

Sharmila
హైదరాబాద్‌: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పార్టీలో ఒక్కొక్క మెట్టే ఎక్కుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు ఆమెకు కలిసి వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. సుదీర్ఘమైన పాదయాత్రకు సిద్ధపడిన నేపథ్యంలో పార్టీలో షర్మిల హోదా ఏమిటనే ప్రశ్న తలెత్తింది. ఏ హోదాలో ఆమె పాదయాత్ర చేస్తుంది, ఆమె ఇచ్చే హామీలను పార్టీ అమలు చేసే అవకాశాలు ఏ మేరకు ఉంటాయి, ఏ హోదా లేకుండా పాదయాత్ర చేస్తే ప్రజలు ఆమె మాటలను ఎలా నమ్ముతారు వంటి ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి.

ఆ ప్రశ్నలకు సమాధానంగా పార్టీలో ఆమెకు సరైన హోదా కల్పించాలనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. పాదయాత్రకు ముందే పార్టీలో ఆమె స్థానం ఏమిటనేది చెప్పాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని పార్టీ నాయకులు కూడా తోసిపుచ్చడం లేదు.

సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ విషయంపై పార్టీ నాయకుడు కొణతాల రామకృష్ణకు ఆ ప్రశ్న ఎదురైంది. ఆ విషయాన్ని ఆయన తోసిపుచ్చలేదు. అంటే, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షురాలిగా నియమించే అవకాశాలున్నాయనే అభిప్రాయానికి బలం చేకూరుతోంది. షర్మిలను పార్టీ కార్యనిర్వహక అధ్యక్షురాలిగా నియమించే ప్రతిపాదన ఉంటే దానిపై పార్టీలో చర్చిస్తామని రామకృష్ణ చెప్పారు.

పార్టీ అధ్యక్షుడిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగుతుండగా, గౌరవాధ్యక్షురాలిగా వైయస్ విజయమ్మ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేపట్టిన నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ షర్మిల పాదయాత్రకు రూపం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు పార్టీ పదవి కూడా అప్పగించే అవకాశాలున్నాయని అంటున్నారు. కాగా, కాంగ్రెసు పార్టీని వీడి వచ్చిన వైయస్ జగన్ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డికి పార్టీలో ఏ విధమైన పదవి ఇవ్వలేదు. దీనిపై కూడా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

English summary
It is said that YSR Congress president YS Kagan's sister may be appointed as party working prtesident, before her padayatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X