వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌తో డీల్‌కు అసదుద్దీన్ మధ్యవర్తిత్వం?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan - Asaduddin Owaisi
హైదరాబాద్: తృణమూల్ కాంగ్రెసు యుపిఎ నుంచి వైదొలిగిన నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసుతో స్నేహానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకు మజ్లీస్ అధినేత అసదుద్దీన్ రాయబారం నడుపుతున్నట్లు ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక రాసింది. మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవెైసీ వెైఎస్సార్‌ కాంగ్రెస్‌ గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో భేటీ అయిన తర్వాత రాజకీయ వర్గాల్లో ఇలాంటి అనుమానాలే తెరపైకి వస్తున్నాయని ఆ పత్రిక వ్యాఖ్యానించింది. కాంగ్రెస్‌లో విలీన అంశం భవిష్యత్తు నిర్ణయిస్తుందని విజయమ్మ ఇటీవలే మీడియాకు చెప్పిన వెైనం వివాదం జరిగిన విషయం తెలిసిందే.

గతంలో కాంగ్రెస్‌ నిలబెట్టిన రాష్టప్రతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీని గెలిపించేందుకు చంచల్‌గూడ జెైల్లో ఉన్న వెైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిని మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవెైసీ కలిసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ రాయబారిగా వచ్చిన ఒవెైసీ జగన్‌తో మాట్లాడి రాష్టప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతునివ్వాలని కోరానని అసద్‌ చెప్పారు. ఆ తర్వాత అనకాపల్లి ఎంపీ సబ్బం హరి, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇద్దరూ కేంద్రహోంమంత్రి చిదంబరం, అహ్మద్‌పటేల్‌తో మంతనాలు సాగించడం, ఆ తర్వాత రాష్టప్రతి ఎన్ని ల్లో వెైకాపా ప్రణబ్‌కు మద్దతు ప్రకటించడం చకచకా జరిగిపోయాయి.

యుపీఏ ప్రభుత్వానికి మమతాబెనర్జీ సారథ్యంలోని తృణమూల్‌కాంగ్రెస్‌ యుపీఏకు మద్దతు ఉపసంహరించుకుని, అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్న సమయంలో ప్రభుత్వం పడిపోతుందని వార్తలు వెలువడుతున్నాయి. అటు ప్రభుత్వం కూడా దేనికైనా సిద్ధమేనని, ఎట్టి పరిస్థితిలో నిర్ణయాలు మార్చుకునేది లేదని కచ్చితంగా చెబుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం పడిపోయే పరిస్థితి నుంచి గట్టెక్కడానికి పావులు కదుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అందులో భాగంగానే విజయమ్మను అసదుద్దీన్‌ కలసి ఉంటారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. గతంలో రాష్టప్రతి ఎన్నికల మాదిరిగానే, ఇప్పుడు కూడా యుపీఏ ప్రభుత్వం మైనారిటీలో పడిపోతే, ప్రభుత్వాన్ని ఆదుకోవాలని కోరేందుకే అసద్‌ విజయమ్మతో చర్చించి ఉంటారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాంగ్రెసుతో కుమ్మక్కులో భాగంగానే జగన్‌ కేసు వాదిస్తున్న సీబీఐ న్యాయవాది, ఎస్పీని కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ మార్చడం, జగన్‌ కేసును నీరుగార్చేందుకే ఈ చర్యలు తీసుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపించడం తెలిసిందే.

ఈ నేపథ్యంలో గతంలో రాష్టప్రతి ఎన్నికల సమయంలో మద్దతుకోసం జగన్‌తో రాయబారం నడిపిన ఒవెైసీ ఇప్పుడు విజయమ్మతో చర్చలు జరపడం సహజంగానే ప్రాధాన్యం సంతరించుకుంది. బయటకు వచ్చిన అసద్‌ మాత్రం తమకు వెైఎస్‌తో మంచి అనుబంధం ఉందని, ముస్లింలకు నాలుగుశాతం రిజర్వేషన్లు ఇచ్చిన మహానేత అంటూ కొనియాడారు. వెైఎస్‌ ఉన్నప్పుడు తాను ఎమ్మెల్యేగా ఉండేవాడినని, అప్పుడు తరచూ వెైఎస్‌తో మాట్లాడేవాడినని, ఇప్పుడు విజయమ్మ కూడా ప్రజాసమస్యలపెై పోరాడుతున్నారని చెప్పారు.

English summary
According to media reports - Congress high command is trying woo YS Jagan lead YSR Congress party. It is said that MIM president and Hyderabad MP Asaduddin Owaisi is medaiting to patchup between the two parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X