వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాయకత్వ మార్పు: జగన్ ఎఫెక్ట్‌ తగ్గించేదెవరు?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: రాష్టంలో నాయకత్వ మార్పు జరుగుతుందనే ప్రచారం మరోసారి ఊపందుకుంది. ముఖ్యమంత్రిని మారుస్తారనే ఊహాగానాలు పెద్ద యెత్తున చెలరేగుతున్నాయి. కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డికి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య నడుస్తున్న వివాదానికి మూలాలు అక్కడే ఉన్నాయని అంటున్నారు. అయితే, తనను మార్చబోరనే దీమాతో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన ఒకటి రెండు సందర్భాల్లో అన్యాపదేశంగా బహిరంగ సభల్లో ప్రస్తావించారు కూడా. కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు ఇచ్చిన హామీతో ముఖ్యమంత్రి దూకుడుగా వెళ్తున్నారని, జైపాల్ రెడ్డితో కయ్యానికి కాలు దువ్వేందుకు కూడా అందుకే సిద్ధపడ్డారని అంటున్నారు.

ముఖ్యమంత్రి మార్పు తథ్యమని కాంగ్రెసులో ఓ వర్గం తీవ్రంగానే ప్రచారం చేస్తోంది. ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేసేవారు చేస్తున్నారు. అయితే, మార్పు చేస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభావాన్ని ఏమైనా తగ్గించగలమా అనేదే ఇప్పుడు కాంగ్రెసు అధిష్టానాన్ని పీడిస్తున్న సంశయం. అలా తగ్గించలేనప్పుడు ముఖ్యమంత్రిని మార్చాల్సిన అవసరం లేదనే అభిప్రాయంతో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, తెలంగాణ రెడ్లకు నాయకత్వాన్ని ఇస్తే, మార్పు ఉంటుందనే అభిప్రాయం ఒక వర్గం నుంచి బలంగా వినిపిస్తోంది.

ఈ స్థితిలోనే పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. జానా రెడ్డి తీవ్రంగా ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. ఆయన జైపాల్ రెడ్డి అండదండలున్నాయి. జానా రెడ్డి పేరును ఆయన ముందు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే కిరణ్ కుమార్ రెడ్డి జైపాల్ రెడ్డితో సమరానికి సై అన్నారని అంటున్నారు. గ్యాస్ కేటాయింపుల పేరుతో ఆయన జైపాల్ రెడ్డిని ఎదుర్కోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, జానా రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమిస్తే పునాది స్థాయిలో పార్టీని బలోపేతం చేయగలమా అనే సందేహం కాంగ్రెసు అధిష్టానంలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే, మర్రి చెన్నారెడ్డి తనయుడు, హైదరాబాదులోని సనత్‌నగర్ శాసనసభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. మర్రి శశిధర్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నందున సీమాంధ్రుల మద్దతు కూడా లభిస్తుందనే ప్రచారం సాగుతోంది. మర్రి శశిధర్ రెడ్డికి మంచి పలుకుబడి ఉందని అంటున్నారు. అయితే, కార్యకర్తల్లోకి చొచ్చుకుని పోగలరా అనేది అనుమానంగా ఉంది.

కాగా, గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి కన్నా లక్ష్మినారాయణ కూడా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. కన్నా లక్ష్మినారాయణకు కాపు సామాజిక వర్గంలో మంచి పలుకుబడి ఉంది. దాంతో ఆయన పేరును కొంత మంది ప్రస్తావిస్తున్నారు. అయితే, అప్పుడు చిరంజీవి గానీ బొత్స సత్యనారాయణ గానీ పోటీకి రావచ్చునని అంటున్నారు. త్వరలో కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ కూడా మారవచ్చునని అంటున్నారు. గులాం నబీ ఆజాద్ స్థానంలో వాయలార్ రవి వస్తారని, ఆయన వచ్చిన తర్వాతనే ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

English summary
The race for new chief minister of Andhra Pradesh has intensified with the perception in Hyderabad that the powers that be in the Congress headquarters could place a new man in charge of the state. Lobbying has intensified but many who have met present chief minister Kiran Kumar Reddy lately say that he exudes confidence that he is going to continue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X