వైయస్ జగన్‌కు మరిన్ని ఎదురుదెబ్బలు

వార్తకథానల సారాంశం ఇలా ఉంది - ఆస్తుల స్వాధీనంలో భాగంగా సాక్షి దినపత్రిక, టీవీ చానల్‌ను కూడా స్వాధీనం చేసుకునే అంశం కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో రెండురకాల ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మీడియా సంస్థలను స్వాధీనం చేసుకుంటే ఎదురయ్య ఇబ్బందులపై ఆలోచన సాగుతోంది. ఈ నెల 28వ తేదీన జగన్ కోర్టుకు హాజరు కావడానికి ముందే అరెస్టు చేసే అవకాశాలున్నట్లు ఓ తెలుగు దినపత్రిక రాసింది. ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల 18న జారీ అవుతుంది. అంతకుముందే జగన్‌ను అరెస్టుచేసే అవకాశాలు లేకపోలేదని ఉన్నతస్థాయి వర్గాల ద్వారా తెలిసింది.
ప్రస్తుతం జగన్ ఉప ఎన్నికల ప్రచారంలో ప్రజల మధ్య తిరుగుతున్నారని, ఈ పరిస్థితిలో జనం మధ్య అరెస్టు చేసినట్లయితే చిక్కులు ఎదురుకావచ్చని కూడా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. 28న జగన్ ఎలాగూ కోర్టుకు హాజరవుతారని, అప్పుడు న్యాయస్థానాన్ని కోరి కస్టడీలోకి తీసుకుంటే సరిపోతుందన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా
జగన్ ఆస్తులను స్వాధీనం చేసుకునే అంశం మీదా సిబిఐ దృష్టి పెట్టినట్టు తెలిసింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సిబిఐ లేఖ రాయనున్నట్టు సమాచారం. జగన్ ఆస్తుల వివరాలను సిబిఐ ఇప్పటికే సేకరించినట్లు తెలుస్తోంది. జగన్ ఆస్తులు అక్రమమని న్యాయస్థానంలో తేలితేనే జప్తు చేయడానికి వీలవుతుందని న్యాయనిపుణులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications