వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతా రెడీ: ఎన్నికలకు ముందే రెండు రాష్ట్రాలు?

By Pratap
|
Google Oneindia TeluguNews

 Bifurcation will be completed within 90 days?
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. 90 రోజుల్లోగా రెండు రాష్ట్రాలు ఏర్పడవచ్చుననే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ మేరకు మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. రాయల తెలంగాణ అంశాన్ని కాంగ్రెసు దాదాపుగా పక్కన పెట్టినట్లే తెలుస్తోంది. కేవలం హైదరాబాద్ విషయంలోనే ఏ విధంగా వ్యవహరించాలనే విషయాన్ని ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసు అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం అనుకుంటున్నట్లుగా జరిగితే అక్టోబర్‌లో రెండు రాష్ట్రాలు ఏర్పడవచ్చునని అంటున్నారు

90 రోజుల్లోనే అవసరమైన రాజకీయ, రాజ్యాంగ ప్రక్రియను పూర్తి చేసేందుకు కార్యాచరణ జరుగుతోంది. కొన్ని నెలల క్రితం ఆంటోనీ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఒకటి రాష్ట్ర విభజనకు సంబంధించిన ప్రాథమిక కసరత్తునంతా పూర్తి చేసిందనీ, మిగిలింది లాంఛనాలు మాత్రమేనని ఢిల్లీలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. విభజనపై సాంకేతిక అంశాలను పూర్తి చేయడానికి ఈనెల 29న యుపిఎ సమన్వయ కమిటీ, 30 లేదా 31న వర్కింగ్ కమిటీ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తేదీలపై ఆదివారం తుది నిర్ణయం తీసుకోవచ్చునని మీడియాలో వార్తలు వచ్చాయి.

ఆగస్టు 5 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందే స్పష్టత సాధించి, ఆ సమావేశాల్లోనే బిల్లుకు ఆమోదం పొందాలని, అక్టోబరులో రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేసి, షెడ్యూలు ప్రకారం సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఎన్నికల గడువులోగా విభజన ప్రక్రియ సమగ్రంగా పూర్తి కాకపోతే, ఆర్నెల్ల పాటు ఎన్నికలను వాయిదా వేసేందుకు రాజ్యాంగపరంగా ఏదైనా అవకాశం ఉందా అన్నదానిపైనా అది న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రస్తుత శాసనసభ, లోకసభ గడువు ముగుస్తుంది.

కొత్తంగా ఏర్పడే రాష్ట్రానికి కూడా తెలంగాణ అని కాకుండా 'హైదరాబాద్ స్టేట్' అని పేరుపెట్టే అవకాశమున్నట్టు చెబుతున్నారు. ఈ విషయాన్ని దిగ్విజయ్ సింగ్ స్వయంగా వార్‌రూమ్ భేటీలో చెప్పినట్లు సమాచారం.

English summary

 It is said that Congress high command, UPA government are making efforts to bifuractae and form two states by october this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X