నో.. నో.. నో...: జగన్ ట్రాప్‌లో చంద్రబాబు?

YS Jagan - Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒత్తిడిలో పడిపోయారా? అంటే అవుననే అంటున్నారు. ఇటీవల బాబు వైఖరి చూస్తుంటే ఆయన ఒత్తిడికి లోనవుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. తద్వారా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కుమ్మక్కు మైండ్‌గేమ్ ట్రాప్‌లో పడిపోయారంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి కూడా కాంగ్రెసు పార్టీతో చంద్రబాబు కుమ్మక్కయ్యారని ఆరోపిస్తోంది.

2004లో అధికారం కోల్పోయిన టిడిపి వరుసగా రెండుసార్లు ప్రతిపక్షంలో కూర్చుంది. 2014లోను ప్రతిపక్షానికే పరిమితం అయితే టిడిపి భవిష్యత్తే అంధకారంలో పడుతుంది. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో తెలంగాణవాదం బలంగా వినిపిస్తుండటం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పుట్టుకు రావడం తదితర పరిణామాలు టిడిపికి ఇబ్బందికరంగా మారాయి. కెసిఆర్, జగన్ పార్టీలు సెంటిమెంట్‌ను నమ్ముకొని ముందుకు పోతున్నాయని చెప్పవచ్చు.

అదే సమయంలో ఆ పార్టీలు రాష్ట్రంలో బలమైన క్యాడర్ ఉన్న టిడిపిని దెబ్బతీసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఓవైపు సెంటిమెంట్‌ను ఉపయోగిస్తూనే.. చంద్రబాబు కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారని విమర్శిస్తున్నారు. ఈ ఆరోపణలను టిడిపి ఎప్పటికి అప్పుడు కొట్టి పారేస్తోంది. కుమ్మక్కుపై ప్రజా ప్రతినిధుల మధ్య కూడా చర్చకు వస్తోంది. దీంతో చంద్రబాబు తీవ్ర ఒత్తిడికి లోనయినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.

వచ్చే ఎన్నికలు తాడోపేడో తేల్చుకోవాల్సినవి కావడం, ఇతర పార్టీలు సెంటిమెంటును ఉపయోగించుకుంటుంటడం, పార్టీని పలువురు నేతలు విడిచిపెడుతుండటం బాబును అసహనానికి, ఒత్తిడికి గురి చేసి ఉంటాయని అంటున్నారు. రెండు రోజులుగా బాబు తీరును పరిశీలిస్తే జగన్ మైండ్ గేమ్ ఒత్తిడి బాబుపై పని చేసినట్లుగానే కనిపిస్తోందని అంటున్నారు. బుధవారం మాజీ మంత్రులు జెసి దివాకర్ రెడ్డి, శంకర రావులను కలిసిన తర్వాత ఆయన కాంగ్రెసు నేతలను కలిసేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ వెంటనే సాక్షి మీడియా, టి-ఛానల్‌ను పార్టీ మీడియా సమావేశాలకు పిలువకూడదని నిర్ణయించుకున్నారు. గురువారం తనను కలిసేందుకు వచ్చిన మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డిలను కలిసేందుకు నిరాకరించారు. ఇలా బాబు తీరును చూస్తుంటే ఆయన ఒత్తిడిలో ఉన్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+