వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫొటోలు: కమల్ హాసన్ వివాదాల పుట్ట

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ తమిళ సినిమాకే కాకుండా భారతీయ సినిమాకు ఇద్దరు ప్రముఖ నటులను అందించారు. ఒకరు - రజనీకాంత్ కాగా, మరొకరు - కమల్ హాసన్. రజనీకాంత్ తన నటనతోనే కాకుండా విభిన్నమైన మ్యానరిజంతో అశేషమైన ప్రేక్షకాభిమానులను తయారు చేసుకున్నారు. వయసు మీద పడినా యువతను ఉర్రూతలూగిస్తున్నాడు. రజనీకాంత్‌ది అంతా మాస్.

కమల్ హాసన్‌ది విభిన్నమైన తరహా. అతను సినిమాల్లో ప్రయోగాలకు ఎప్పుడూ తహతహలాడుతుంటాడు. ప్రయోగాల కోసం అతను నిర్మాతగా కూడా మారాడు. కథను తానే సిద్ధం చేసుకుంటాడు. తన నటనా కౌశలంతో మాస్, క్లాస్ ప్రేక్షకులను అలరించాలనేది అతని తపన. చాలా అరుదైన అంశాలను తన సినిమాకు ముడిసరుగ్గా ఎంచుకుంటాడు. సాంకేతిక ప్రయోగాలకు ఉవ్విళ్లూరుతుంటాడు. ఆయన సాంకేతిక ప్రయోగాల ఆసక్తికి అపూర్వ సహోదరులు సినిమా ఓ మచ్చు తునక. ఇందులో కమల్ మరుగుజ్జుగా, సాధారణమైన వ్యక్తిగా రెండు పాత్రలు పోషించి అద్భుతమనిపించాడు.

ప్రేక్షకులను అబ్బురపరచాలనేది కమల్ హాసన్ తపన. దశావతారాలు సినిమా కూడా ఆ కోవలోకే వస్తుంది. ఇందులో పది పాత్రలు - ఆడమగా, యుయముసలి పాత్రలు పోషించాడు. కథాబలం ఉన్న పాత్రల్లో నటించడానికి కమల్ హాసన్ ఇష్టపడుతాడు. అతని ప్రయత్నాల్లో కమల్ హాసన్‌కు వివాదాలు తప్పడం లేదు. తాజాగా, విశ్వరూపం సినిమా వివాదంలో చిక్కుకుంది. హైకోర్టు నుంచి ఆయనకు ఊరట లభించింది. అయితే, వివాదం వల్ల ఆర్థికంగా కమల్ హాసన్ నష్టపోయే ఉంటారు. డీగ్లామరైజ్డ్ పాత్రలు వేయడానికి కూడా కమల్ హాసన్ భయపడలేదు. పదహారేళ్ల వయస్సు తమిళ వెర్షన్‌లో ఏ మాత్రం గ్లామర్ లేని కుంటివాడి పాత్రను పోషించి మెప్పించాడు. అలా పలు సినిమాల్లో గ్లామర్ లేని పాత్రలు పోషించాడు. ప్రేక్షకుల మన్ననలు కూడా పొందాడు. హాస్యపాత్రలను పోషించి మెప్పించాడు.

హిందీలోనూ కమల్ హాసన్ తన మార్కును చూపించడానికి ప్రయత్నించాడు. విభిన్నమైన కథావస్తువులతో అతను అలరించే ప్రయత్నం చేశాడు. ద్రోహకాల్ కూడా ఒక రకంగా వివాదాస్పదమైన సినిమానే. విశ్వరూపం సినిమాకు ముందు దశావతారాలు, సండియార్ సినిమాలు ఆయనను వివాదాల్లోకి నెట్టాయి.

ఫొటోలు: కమల్ హాసన్ వివాదాల పుట్ట

కమల్ హాసన్ సినిమా దశావతారాలు సినిమా వివాదాలకు అప్పట్లో నిలయంగా మారింది. హిందువుల్లోని ఓ వర్గాన్ని ఆ సినిమా కించపరిచిందంటూ దుమారం చెలరేగింది. ఇందులో కమల్ హాసన్ చరిత్ర మూలాల్లోకి వెళ్లి ఆధునిక వరకు వస్తూ పలు విషయాలను తడమడమే కాకుండా పది పాత్రలు పోషించి ప్రేక్షకులను అబ్బురపరిచే ప్రయత్నం చేశాడు.

ఫొటోలు: కమల్ హాసన్ వివాదాల పుట్ట

సాండియార్ సినిమా టైటిల్ తీవ్ర వివాదానికి దారి తీసింది. దళితులను, రాజకీయ నాయకులను ఈ సినిమా కించపరిచే విధంగా ఉందంటూ రాజకీయ నాయకులు దుమ్మెత్తిపోశారు. దాంతో ఆయన అప్పటి ముఖ్యమంత్రి జయలలితను కలిసి టైటిల్ మార్చుకోవాల్సి వచ్చింది.

ఫొటోలు: కమల్ హాసన్ వివాదాల పుట్ట

ద్రోహి సినిమా కూడా ఒక రకంగా వివాదాస్పదమైందే. నక్సలైట్లకు, పోలీసులకు మధ్య జరిగే సమరంలో ఇరువైపులా ఆయన విమర్సలు పెట్టారు. సినిమా సాధారణంగా కనిపించినప్పటికీ అంతరంగంలో భయాందోళనలు రేపే సన్నివేశాలు ఇందులో ఉన్నాయి.

ఫొటోలు: కమల్ హాసన్ వివాదాల పుట్ట

తాజాగా విశ్వరూపం సినిమా వివాదం అందరికీ తెలిసిందే. వివాదం ఈ సినిమాను చుట్టుముట్టింది. తమిళనాడు ప్రభుత్వం ఏకంగా సినిమానే నిషేధించింది. భారత ప్రభుత్వం కమల్ హాసన్‌కు అండగా ముందుకు రావాల్సి వచ్చింది.

English summary
It seems Kamal Hassan, as artist always likes to invite controversies. From Sandiyar to Viswaroopam, the controversies surrounded Kamal Hassan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X